Lava Agni 2 5G Smartphone Launch in India: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 2021 చివరలో వచ్చిన అగ్ని ఫోన్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, క్వాడ్‌ కెమెరా, 66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం, 50-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా లాంటి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఈ శ్రేణిలోని ఏ స్మార్ట్‌ఫోన్‌లోనూ మీరు ఇన్ని స్పెసిఫికేషన్స్ చూడలేరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Lava Agni 2 5G Price:
లావా అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు 2023 మే 24 ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ 8 జీబీ రామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఒకే ఒక్క రంగులో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధరను లావా కంపెనీ రూ.21,999గా నిర్ణయించింది. అమెజాన్‌ ద్వారా ఈ ఫోన్ కొనుకోవచ్చు. ఏ ప్రధాన బ్యాంక్‌ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేసినా.. రూ. 2000 డిస్కౌంట్‌ లబిస్తుంది. అంటే ఫోన్‌ రూ.19,999కే మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.


Lava Agni 2 5G Camera:
లావా అగ్ని 2 ఫోన్‌లో 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ, కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తుంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేటుతో వస్తోంది.  అగ్ని 2 వెనుక వైపు 3డీ గ్లాస్‌ డిజైన్‌, మ్యాటీ ఫినిష్‌ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డిమెన్‌సిటీ 7050 ప్రాసెసర్‌ను అమర్చారు. ఈ ప్రాసెసర్‌ను వాడిన తొలి కంపెనీ లావానే కావడం విశేషం. అగ్ని 2 50 ఎంపీ బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుంది. మిగిలిన మూడింటిలో 8+2+2 ఎంపీ కెమెరాను అమర్చారు. ర్యామ్‌ను 16జీబీ వరకు వాడుకోవచ్చు. 


Lava Agni 2 5G Battery:
లావా అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13తో వస్తోంది. ఇందులో ఎలాంటి బ్లోట్‌ వేర్‌ ఉండదని కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్‌ 15 అప్‌డేట్స్‌తో పాటు మూడేళ్ల పాటు క్వార్టర్లీ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇందులో ఉంటయ్య్య్. అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌ 4700 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. ఇది 66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 0 నుంచి 50 శాతం బ్యాటరీ 16 నిమిషాల్లో ఛార్జ్‌ అవుతుందని కంపెనీ అంటోంది. 


Also Read: Oppo F23 5G Launch: ఒప్పో నుంచి బలమైన బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌.. 18 నిమిషాల్లోనే ఛార్జింగ్‌! ధర, ఫీచర్ల వివరాలు ఇవే  


Also Read: Virat Kohli: నేను బౌలింగ్‌ చేసుంటే రాజస్తాన్‌ 40 పరుగులకే ఆలౌటయ్యేది.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.