Lenovo M11 Tab: 7వేల ఎంఏహెచ్ బ్యాటరీ, 8జీబి ర్యామ్‌తో చాలా తక్కువ ధరకే లెనోవో ట్యాబ్
Lenovo M11 Tab: అద్భుతమైన ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ ట్యాబ్ కోసం ఎదురు చూస్తుంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ టెక్ కంపెనీ లెనోవో నుంచి సరికొత్త ట్యాబ్ ఇండియాలో లాంచ్ అయింది. ఈ ట్యాబ్ ఫీచర్లు, ధర ఇలా ఉన్నాయి.
Lenovo M11 Tab: లెనోవో ఇటీవల ఇండియన్ మార్కెట్‌లో Lenovo M11 Tab లాంచ్ చేసింది. ప్రీమియర్ డిజైన్, అధునాతన ఫీచర్లతో పాటు ఏకంగా 7 వేల ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిన ట్యాబ్ ఇది. ఫీచర్లు అద్భుతంగా ఉండటమే కాకుండా ధర కూడా చాలా అందుబాటులో ఉండటంతో అందర్నీ ఆకట్టుకుంటోంది.
లెనోవో ఎం11 ట్యాబ్ 11 ఇంచెస్ డిస్‌ప్లేతో 1920/1200 రిజల్యూషన్ కలిగి ఉంటుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండే డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే ట్యాబ్ ఇది. ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. రెండేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉచితంగా లభిస్తాయి. 15 వాట్స్ ఛార్జింగ్ సోపర్ట్ ఉంటుంది. అంతేకాకుండా 7040 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉండటంతో 10 గంటల వీడియో బ్యాకప్ ఉంటుంది.
లెనోవో ఎం11 ట్యాబ్ మీడియాటెక్ హీలియో జి8 చిప్‌సెట్ కలిగి ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కావడంతో ట్యాబ్ పనితీరు వేగంగా ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు ఉపయోగించి 1 టీబీ వరకూ పెంచుకోవచ్చు. ట్యాబ్ వెనుకవైపు 13 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. సెల్ఫీ లేదా వీడియో కాల్ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా అమర్చింది కంపెనీ. లెనోవో ఎం11 ట్యాబ్ ధర 17,999 రూపాయలుగా ఉంది. సీఫామ్ గ్రీన్ కలర్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో అందుబాటులో ఉంది. అన్నింటికంటే ప్రత్యేకత ఏంటంటే ఈ ట్యాబ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది.
Also read: Instagram Earning Tips: ఇన్‌స్టా నుంచి డబ్బులు సంపాదించడం ఎలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook