ఇంట్లో కూర్చుని లక్షల రూపాయలు సంపాదించే మార్గాలున్నాయి. మెటా అనుబంధ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. మీరు చేయాల్సిందల్లా కొన్ని రీల్స్ చేసి అప్‌లోడ్ చేయడమే. ఇన్‌స్టాగ్రామ్ ఆఫర్ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముష సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ ఫోకస్ మారుతోంది. ఫోటో షేరింగ్ కంటే ఇప్పుడు షార్ట్ వీడియోలపై పెట్టింది. గత రెండేళ్లుగా ఇన్‌స్టా ఫోకస్ అంతా వీడియోలపైనే ఉంది. ఇందులో భాగంగా కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతోంది. టిక్‌టాక్‌కు పోటీ ఇచ్చేందుకు షార్ట్ వీడియోలు ప్రోత్సహించాలనుకుంటోంది. వీడియోల ద్వారా సంపాదించేందుకు ఆఫర్ కూడా ఇచ్చింది. ఇప్పుడు దీపావళి పురస్కరించుకుని అదనంగా సంపాదించే ఆఫర్ ఇస్తోంది. అదెలాగో చూద్దాం..


ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా రీల్స్ ప్లే బోనస్ ఆఫర్‌ను ఇండియాలో ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌లో భాగంగా యూజర్లకు 4 లక్షల రూపాయల వరకూ బోనస్ లభించనుంది. ఇప్పటివరకూ ఈ ఆఫర్ అమెరికాలోనే ఉంది. ఇప్పుడు భారతీయులకు కూడా వర్తించనుంది. దీనివల్ల భారతీయ కంటెంట్ క్రియేటర్లకు బ్రాండ్ స్పాన్సర్ షిప్‌తో పాటు మెటా నుంచి నేరుగా డబ్బులు సంపాదించే అవకాశం లభిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ ఈ ఆఫర్‌తో ఎక్కువ రీల్స్ చేసేలా ప్రోత్సహిస్తోంది. 


ఈ ఆఫర్‌లో భాగంగా రీల్స్ చేసిన తురవాత ఎన్నిసార్లు ప్లే అయిందనేదానిపై ఆధారపడి ఇన్‌స్టాగ్రామ్ బోనస్ ఇస్తుంది. 165 మిలియన్ల వరకూ కౌంట్ చేస్తారు. బోనస్ కోసం 150 రీల్స్ ఉండాలి. ఒకసారి ప్రారంభమైతే..అత్యధిక బోనస్ కోసం నెలరోజులు సమయముంటుంది. నవంబర్ 11న బోనస్‌ను యాక్టివేట్ చేయనుంది. యూజర్ల అప్‌లోడ్ చేసిన రీల్స్ నెలరోజుల్లో 1000 వ్యూస్ సాధిస్తే బోనస్‌కు అర్హత సాధిస్తారు.


Also read: Electricity Bill fraud: ఆన్‌లైన్ కరెంటు బిల్లు చెల్లిస్తున్నారా..జాగ్రత్త, ఒక్క క్లిక్‌తో ఎక్కౌంట్ ఖాళీ కావచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook