Nothing Phone Launch: రెండు 50MP కెమేరాలు, 12GB Ramతో Nothing లేటెస్ట్ ఫోన్ లాంచ్ ఇవాళే, ధర ఎంతంటే
Nothing Phone Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ నుంచి మరో లేటెస్ట్ ఫోన్ ఇవాళ ఇండియాలో లాంచ్ కానుంది. 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమేరాతో ఉండటంతో అందరికీ ఆసక్తి ఎక్కువగా ఉంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Nothing Phone Launch: Nothing Phone 2A Plus ఇవాళ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండటంతో ఈ ఫోన్ పై చాలా అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్ ఫోటోలను కంపెనీ షేర్ చేసింది. ధర ఇతర వివరాల్ని గోప్యంగా ఉంచింది. కెమేరా రిజల్యూషన్ అద్భుతంగా ఉండనుందని మాత్రం తెలుస్తోంది.
Nothing Phone 2A Plus స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల ఎమోల్డ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7350 ప్రో చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. Mali G610 MC4 GPU కలిగి ఉంటుంది. ఇక ర్యామ్ అయితే ఏకంగా 12 జీబీ వరకు ఉంటుంది. దాంతో ఫోన్ పని తీరు చాలా వేగంగా ఉండనుంది. అంతేకాకుండా ఈ ఫోన్ ర్యామ్ 20 జీబీ వరకు పెంచుకునే అవకాశముండటం విశేషం.
నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ స్మార్ట్ ఫోన్ గ్రే సిల్వర్ డ్యూయల్ టోన్ డిజైన్‌తో వస్తోంది. ఎల్ఈడీ లైట్ విత్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ , టెక్స్చర్ డిజైన్ అవుట్ లైన్ ఉంది. ఇందులో 8జీబీ ర్యామ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక కెమేరా విషయం పరిశీలిస్తే ఇందులో డ్యూయల్ కెమేరా సిస్టమ్ ఉంది. కానీ శక్తివంతమైన రెండూ శక్తివంతమైనవే. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరాతో పాటు సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం కూడా 50 మెగాపిక్సెల్ కెమేరా ఉండటం విశేషం.
ఇవాళ మద్యాహ్నం అంటే జూలై 31 మద్యాహ్నం 2.30 గంటలకు లాంచ్ కానుంది. ధర గురించి వివరాల వెల్లడి కాలేదు. కానీ నథింగ్ ఫోన్ 2ఎ మోడల్ 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర 23,999 రూపాయలుగా ఉంది. ఇందులోనే 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ వెర్షన్ ఫోన్ ధర 25,999 రూపాయలుగా ఉంది. ఇక 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ వెర్షన్ అయితే 27,999 రూపాయలుంది. దాంతో ఇవాళ లాంచ్ కానున్న నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ ధర 2 వేలు తేడా ఉండవచ్చని తెలుస్తోంది.
Also read: Best Protein Foods: మాంసాహారాన్ని మించి ప్రోటీన్లు అందించే 5 బెస్ట్ వెజిటబుల్ ఫుడ్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook