Best Protein Foods: చాలామంది ప్రోటీన్ ఫుడ్ అంటే మాంసాహారమే అనుకుంటారు. అత్యధికంగా ప్రోటీన్స్ ఉండేది నాన్ వెజ్ ఆహారంలోనే అనే ఆలోచనలో ఉంటారు. కానీ 5 రకాల శాకాహార భోజనంలో మాంసాహారాన్ని మించి ప్రోటీన్లు ఉంటాయని చాలా మందికి తెలియదు. ఆ వివరాలు మీ కోసం.
Buckwheat Flour Buckwheat Flourలో ప్రోటీన్లు చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి. ఈ పిండితో రోటీ చేసుకుని తింటారు
శెనగలు కాబూలీ శెనగల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఉత్తరాదిన ఛోళే అని పిలుస్తారు. ఆరోగ్యానికి చాలా మంచిది.
సోయా బీన్స్ సోయా బీన్ అనేది మొక్క నుంచి వచ్చే ప్రోటీన్ ఫుడ్. శరీరంలో ప్రోటీన్లు పుష్కలంగా ఉండాలంటే వారంలో ఓసారి తప్పకుండా సోయా బీన్ తీసుకోవాలి.
క్వినోవా క్వినోవా అనేది బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనిని కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ అని పిలుస్తారు.
చియా సీడ్స్ చియా సీడ్స్ వినియోగం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఇందులో కూడా ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి.