Nothing Phone 2: అమెరికాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ నథింగ్ మరో ఫోన్ ని విడుదల చేయనున్నట్లు సమాచారం. గత ఏడాదిలో లాంచ్ అయిన నథింగ్ వన్ ప్రపంచ దేశాల్లో ఎంతో గుర్తింపు పొందింది. ఈ ఫోన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు చాలా రకాల కొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. బడ్జెట్ పరంగా ఈ ఫోన్ మామూలు వినియోగదారులకు కూడా లభించందని చెప్పవచ్చు. అయితే నథింగ్ 2 పేరుతో విడుదల అవుతున్న ఫోన్ ఎలాంటి ఫీచర్లతో కస్టమర్లకు లభించబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నథింగ్ వన్ ఫోన్ విడుదలైన తర్వాత చాలా పేరు పొందిన కంపెనీలకు చెందిన స్మార్ట్ఫోన్లు కూడా మార్కెట్లో విక్రయాల రేటు కోల్పోయాయి. ముఖ్యంగా నథింగ్ ఫోన్ యాపిల్, రియల్ మీ వంటి పెద్ద కంపెనీల ఫోన్లతో పోటీ పడింది. అయితే కొత్తగా లాంచ్ అయ్యే నథింగ్ ఫోన్ టు లో చాలా రకాల ఫీచర్లు అందుబాటులో ఉండడంతో యాపిల్ 14, ఇతర పెద్ద కంపెనీల కు చెందిన స్మార్ట్ ఫోన్లతో పోటీ పడనుంది. 


ఇప్పటికే నథింగ్ ఫోన్ టు కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇది ఆపిల్ 12 ప్రో డిజైన్ పోలి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పటికీ నథింగ్ కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడం విశేషం. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నథింగ్ ఫోన్ 2.. వెనక సైడ్ లో మూడు పెద్ద కెమెరాలతో పాటు నథింగ్ వన్ ఫోన్ ఉన్న బ్యాక్ ప్యానెల్ ఎల్ఈడి లైట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా చాలా రకాల ఫీచర్లతో మార్కెట్లోకి రాబోతోందని పలువురు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ ఫోన్ వస్తే ఎలాంటి ధరలో అందుబాటులో ఉంటుందో అధికారిక ప్రకటన దాకా వెయిట్ చేయాల్సిందే.