Nothing Phone 2a Design Leaked: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం నథింగ్ (Nothing) లవర్స్‌కు ఓ గుడ్ న్యూస్. నథింగ్ నుంచి కొత్త మొబైల్ నథింగ్ 2ఎ (Nothing Phone 2a) మోడల్ వచ్చేస్తుంది. ఈ కొత్త ఫోన్ లాంచ్ పై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ.. త్వరలోనే లాంచ్ కానున్నట్టు సమాచారం. ఇంకా.. ఈ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్(Flipkart) లో లిస్ట్ అయింది. నథింగ్ నుంచి వచ్చే ఈ థర్డ్ మొబైల్ ఫిబ్రవరిలో లాంచ్ అవుతుందని ఎప్పుడు నుంచో రూమర్లు విన్పిస్తున్నాయి. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో లిస్ట్ అవ్వడం మొబైల్ లవర్స్ కి ఓ శుభవార్త అనే చెప్పాలి. ఫ్లిప్ కార్ట్ లో నథింగ్ 2ఎ మోడల్ లిస్ట్ అయినట్లు కనిపించింది. కానీ.. ఈ మొబైల్ లాంచ్ వివరాలు గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు ఫ్లిప్ కార్ట్. త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ కానున్నట్టు వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Post Office Saving Scheme: బెస్ట్ సేవింగ్ స్కీమ్.. ఏడాదిలోనే రూ.70 వేలకు పైగా ఆదాయం  


అయితే, నథింగ్ ఫోన్ 2ఎ మునుపటి నథింగ్ ఫోన్ 2 మాదిరిగానే కొన్ని ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. రెడిట్ యూజర్  నథింగ్ ఫోన్ 2ఎ ఫోటోల్ని షేర్ చేశాడు. ఈ ఫోటోల్ని బట్టి నథింగ్ ఫోన్ 2ఎ న్యూ డిజైన్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. నథింగ్ ఫోన్ 2ఎ రోజువారీ స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందించేందుకు వీలుగా అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో ప్రవేశపెడుతోంది.


గత వారమే నథింగ్ కంపెనీ మార్కెటింగ్ లీడ్ హెడ్ అకిస్ ఇవెన్ జెలిడిస్ కమ్యూనిటీ అప్ డేట్ వీడియోలో ఫోన్ లాంచ్ గురించి చెప్పారు. నథింగ్ ఫోన్ 2ఎ ఫోన్ ఏరోడాక్టిల్ అనేది కోడ్‌నేమ్. అత్యంత ఇష్టపడే నథింగ్ ఫోన్ 2లో ఫీచర్లు భిన్నంగా ఉంటాయి. నథింగ్ ఫోన్ 1తో పోల్చితే స్పష్టమైన అప్‌గ్రేడ్‌ను కలిగి ఉంటుందని కంపెనీ అధికారిక ప్రకటనలో రివీల్ చేయలేదు. భారత మార్కెట్లో సీఎమ్ఎఫ్ బడ్స్, సీఎమ్ఎఫ్ నెక్‌బ్యాండ్ ప్రో అనే రెండు కొత్త ఉత్పత్తులను త్వరలో ప్రవేశపెడతామని కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే, ఇప్పటివరకు తెలిసినవి కొన్ని లీక్‌లు ఇలా ఉన్నాయి.


నథింగ్ ఫోన్ 2ఎ ఫీచర్లు, ధర (అంచనా):
నథింగ్ ఫోన్ 2ఎ ఫోన్ మోడల్ (Visionix), బీఓఈ నుంచి 6.7-అంగుళాల 120హెచ్‌జెడ్ ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఇతర డిస్‌ప్లే స్పెషిఫికేషన్లు తెలియవు. నథింగ్ ఫోన్ 2ఎ ఫోన్ అనేది మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ ద్వారా అందిస్తుంది. నథింగ్ ఫోన్ బ్లాక్, వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో పొందవచ్చు. త్వరలో జరగబోయే (MWC 2024) ఈవెంట్‌లో నథింగ్ ఫోన్ 2ఎ ఫీచర్లను వెల్లడించకపోవచ్చు.


సోషల్ మీడియాలో లీక్ అయిన ఫొటోలు నథింగ్ ఫోన్ 2ఎ 50ఎంపీ బ్యాక్ కెమెరాతో సహా డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుందని సూచిస్తున్నాయి. ఎడమవైపు అడ్డంగా కాకుండా మధ్యలో నిలువుగా ఉంటుంది. నథింగ్ ఫోన్ 32ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు గ్లిఫ్ కంట్రోల్స్ కలిగి ఉంటుంది. అయినప్పటికీ తక్కువ కస్టమైజడ్ ఆప్షన్లు ఉన్నాయి.


నథింగ్ ఫోన్ 2ఎ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా నథింగ్ ఓఎస్ 2.5పై రన్ అవుతుందని అంచనా. నథింగ్ ఓఎస్ అనేది క్లీన్, స్మూత్ స్కిన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మొదటి వెర్షన్ నుంచి అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. నథింగ్ ఫోన్ 2ఎ మోడల్ కొన్ని గ్లిఫ్-సంబంధిత ఫీచర్లు మినహా నథింగ్ ఫోన్ 2 మాదిరిగానే 3 సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్‌లు, సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.


నథింగ్ ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీని కలిగి ఉంటుంది. అయితే, ఇతర వేరియంట్‌లు ఉంటాయా అనేది అస్పష్టంగా ఉంది. పవర్ విషయానికి వస్తే.. నథింగ్ ఫోన్ 2ఎ మోడల్ 5000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని అందించవచ్చు. అంతేకాకుండా 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది. ఇక, ధర విషయానికి వస్తే.. 30 వేల లోపు ఉండొచ్చని సమాచారం.


Also Read: Assistant Loco Pilot Jobs: పదో తరగతి పాసైతే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టేయొచ్చు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి