National Saving Scheme Latest Updates: ప్రజలను పొదుపు వైపు ఆకర్షించేందుకు పోస్టాఫీసులో అనేక స్కీమ్‌లు ఉన్నాయి. ఈ పథకాలు సామాన్య పౌరుల అవసరాలను తీర్చిలా మంచి వడ్డీ రేట్లతో రూపొందించారు. అన్ని పోస్ట్ ఆఫీస్ పథకాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పోస్టాఫీసు స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాలతోపాటు సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీసు స్కీమ్‌లలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) పెట్టుబడి పెట్టేందుకు మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. సాధారణ ఆదాయాన్ని కోరుకునే చిన్న తరహా పెట్టుబడిదారుల కోసం ఈ పథకాన్ని రూపొందించారు.
NSC స్కీమ్ వివరాలు
==> నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్‌లో పెట్టుబడిపై ప్రభుత్వం 7.7 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
==> పెట్టుబడిదారుడు కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టాలి
==> పెట్టుబడిపై గరిష్ట పరిమితి లేదు.
==> ఈ స్కీమ్ కింద లాక్-ఇన్ వ్యవధి 5 సంవత్సరాలు.
==> ప్రభుత్వం నిర్వహించే ఈ పథకంలో మన దేశ పౌరులు మాత్రమే పెట్టుబడి పెట్టాలి.
==> ఈ స్కీమ్ కింద కింద ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కలిసి పెట్టుబడి పెట్టేందుకు జాయింట్ అకౌంట్‌ను తెరవవచ్చు. తల్లిదండ్రులు తమ మైనర్‌ల పేరిట కూడా ఖాతాలను ఓపెన్ చేసుకోవచ్చు.
==> ఎవరైనా రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. 7.7 శాతం వడ్డీ రేటుతో రూ.6,73,551 వడ్డీని పొందవచ్చు. మెచ్యూరిటీపై మొత్తం రూ.21,73,551 అందుతుంది.
Also Read: Bharat Rice: రేపటి నుంచే 'భారత్ రైస్'.. రూ.29కే బియ్యం ఎక్కడ తీసుకోవాలో తెలుసా?
అవసరమైన పత్రాలు
ఎన్‌ఎస్‌సీకి దరఖాస్తు చేయడానికి కొన్ని డాక్యుమెంట్స్ అందించాలి. పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, సీనియర్ సిటిజన్ ఐడీ లేదా ఏదైనా ప్రభుత్వ ఐడీ అవసరం. మీరు మీ ఫోటోను అందించాలి. సర్టిఫికెట్ హోల్డర్ మరణిస్తే.. న్యాయమూర్తి ఆదేశిస్తే పెట్టుబడి పెట్టిన నగదును వెనక్కి తీసుకోవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేట్లు 6.9 నుంచి 7.5 శాతం వరకు అందజేస్తోంది. ఈ వడ్డీ రేటు మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లు మారుతాయి. వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన లెక్కించినా.. ప్రతీ యేటా చెల్లిస్తారు. ఈ స్కీమ్‌లో రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. 6.9 శాతం వడ్డీని లెక్కిస్తే.. పథకం పూర్తయిన తర్వాత మీకు రూ.70,806 వడ్డీ లభిస్తుంది. ఒక సంవత్సరం తరువాత మీ రాబడి రూ.10,70,806 అవుతుంది.
రెండేళ్లపాటు రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేసి.. 7.0 శాతం వడ్డీని లెక్కిస్తే రూ.148882 వడ్డీగా, రూ.1148882 రాబడిగా లభిస్తుంది. మూడేళ్లకు రూ.10 లక్షలు పెట్టుబడి.. వడ్డీ రేటు 7.1 శాతం అయితే వడ్డీగా రూ.235075, మొత్తం రాబడిగా రూ. 12,35,075 లభిస్తుంది. 7.5 శాతం వడ్డీతో ఐదేళ్లపాటు రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.449948 వడ్డీగా, రూ.1449948 మొత్తం రాబడిగా లభిస్తుంది.
Also Read: Assistant Loco Pilot Jobs: పదో తరగతి పాసైతే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టేయొచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి