Nothing Phone 2A Minus Points: అందరూ ఎంతగానో ఎదురు చూసిన నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యింది. ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరతో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది. అయితే దీనిని కంపెనీ మొత్తం రెండు వేరియంట్స్‌లో విడుదల చేసింది. ఇందులో 12 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగి వేరియంట్‌ ధర రూ.29,999తో లభిస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా 6 శాతం తగ్గింపుతో కేవలం రూ. 27,999తో లభిస్తోంది. అయినప్పటికీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫీచర్స్‌ ప్రకారం ధర ఎక్కువగానే టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఈ మొబైల్‌లో ఉన్న నెగిటివ్‌ పాయింట్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్‌ నెగిటివ్‌ పాయింట్స్‌:
ముఖ్యంగా ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ నెగిటివ్‌ పాయింట్స్‌ వివరాల్లోకి వెళితే, ఈ నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్‌ డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్ వరకు మాత్రమే సపోర్ట్‌ చేస్తుంది. అంతేకాకుండా స్కీన్‌ ప్రోటక్షన్‌ కోసం కేవలం Gorilla Glass 3 గ్లాస్‌ను మాత్రమే అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఇదే ధరల్లో లభించే ఇతర బ్రాండ్‌కు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ 90Hz లేదా 120Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తున్నాయి. దీంతో Gorilla Glass 5 ప్రోక్షన్‌తో అందుబాటులోకి ఉన్నాయి. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ప్రాసెసర్ వివరాల్లోకి వెళితే..పాత Snapdragon 695 ప్రాసెసర్‌తో లభిస్తోంది. కాబట్టి గేమ్స్‌ ఆడేవారికి ఈ మొబైల్ అనుకూలంగా ఉండకపోవచ్చు. అలాగే ఇది 6GB ర్యామ్‌తో మాత్రమే లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యే ఇతర మొబైల్ అన్ని 8GB లేదా 12GB ర్యామ్‌తో అందుబాటులో ఉండడం దీపికి పెద్ద మైనస్‌ పాయింట్‌గా చెప్పొచ్చు. 


ఇక నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ వివరాల్లోకి వెళితే ఇది 128GB స్టోరేజ్‌తో మాత్రమే లభిస్తోంది. అంతేకాకుండా ఇందులో అదనంగా స్టోరేజ్‌ను పెంచుకోవడానికి ఎలాంటి మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా అందుబాటులో లేదు. అలాగే ఈ మొబైల్‌ కేవలం 50MP ప్రధాన కెమెరాతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మొబైల్‌ కంటే తక్కువ ధరలో ఉన్నవి కూడా 108MP కెమెరాతో లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మొబైల్‌ 16MP సెల్ఫీ కెమెరా మాత్రమే కలిగి ఉంది. ఇదే ధరకు లభించే ఇతర బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌లో 32MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


ఇక ఈ మొబైల్‌ బ్యాటరీ కూడా పెద్ద మైనస్‌ పాయింట్‌గా భావించవచ్చు. ఇది కేవలం 4500mAh బ్యాటరీతో లభిస్తోంది. ప్రస్తుతం ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన ప్రతి మొబైల్‌ 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా ఇది కేవలం 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను మాత్రమే కలిగి ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ సింగిల్‌ స్పీకర్‌ను మాత్రమే కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో హెడ్‌ఫోన్ జాక్ కూడా అందుబాటులో ఉండదు.  దీంతో పాటు ఇది నామమాత్రపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో లభిస్తోంది. ఇవే కాకుండా చాలా మైనస్‌ పాయింట్స్‌ పాటు ప్లస్‌ పాయింట్స్‌ కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లో లభిస్తున్నాయి. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి