Oneplus 12 Launch Date: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా వన్ ప్లస్ నార్డ్ 3 త్వరలోనే భారత్లో విడుదల చేసేందుకు కంపెనీ నిర్ణయించింది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు వన్ ప్లస్ 12 కూడా త్వరలో విడుదల చేయబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ మొబైల్ కు సంబంధించిన విడుదల సమాచారాన్ని ప్రముఖ టెక్ యూట్యూబర్ లీక్ చేసాడు. ఇంతకు ఉన్న స్మార్ట్ ఫోన్లు కంటే ఇందులో చాలా రకాల కొత్త ఫీచర్లు ఉండబోతున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వన్ ప్లస్ 12లో ఇమేజింగ్ సెన్సార్:
ఇంతవరకు ఎప్పుడూ చూడని కొత్త ఫీచర్ ని వన్ ప్లస్ 12లో చూడబోతున్నాం.  GSMArena కెమెరా లెన్స్ తో పాటు టెలిఫోటో లెన్స్ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్  50 MP ల బ్యాక్ కెమెరాతో పాటు 48 MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కూడా పొందవచ్చు. ఇక బ్యాక్ కెమెరా విషయానికి వస్తే.. వన్ ప్లస్ 12లో 16 MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. మీది కెమెరాలతో ఫొటోస్ ని DSLR లో తీసిన అనుభూతిని పొందవచ్చు. 


Also Read: Dalit Bandhu Phase 2: దళిత బంధు రెండో విడతకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్  


అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. 100W SUPERVOOC చార్జింగ్ సపోర్ట్ తో అతి తొందరగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ విడుదల వివరాల్లోకి వస్తే..చైనాలో ఈ డిసెంబర్ నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక భారత దేశ వ్యాప్తంగా వచ్చే సంవత్సరం మొదటి నెలలో విడుదల చేయబోతున్నారని ప్రముఖ టెక్ యూట్యూబ్ తెలిపారు.


OnePlus 12 స్పెసిఫికేషన్స్:
✽ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల QHD OLED స్క్రీన్‌
✽ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoC
✽ 5000mAh బ్యాటరీ 
✽ 50MP ప్రైమరీ లెన్స్ కెమెరా
✽ 50MP అల్ట్రా-వైడ్ కెమెరా
✽ 64MP పెరిస్కోప్ లెన్స్ కెమెరా
✽ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్
✽ 50 W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
✽ Android 13 ఆధారిత MIUI 14


Also Read: Dalit Bandhu Phase 2: దళిత బంధు రెండో విడతకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి