OnePlus Nord CE 3Lite: OnePlus Nord CE 3 Lite స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 8జిబి ర్యామ్, 256 జీబీ వరకూ స్టోరేజ్ కలిగి 108 మెగాపిక్సెల్ కెమేరా కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు 18 వేలకే లభిస్తోంది. కంపెనీ ఈ వేరియంట్ ధరల్ని భారీగా తగ్గించడమే ఇందుకు కారణం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OnePlus నుంచి లాంచ్ అయి క్రేజ్ సంపాదించకున్న స్మార్ట్‌ఫోన్లలో OnePlus Nord CE 3 Lite 5G ముఖ్యమైంది. ఇందులో 128 జీబీ, 256 జీబీ రెండు స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. OnePlus Nord CE 3 Liteలో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ లాంచింగ్ ధర 19,999 రూపాయలు కాగా ఇప్పుడు కేవలం 17,999 రూపాయలకే లభిస్తోంది. ఇక OnePlus Nord CE 3 Liteలో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ లాంచ్ ధర 21,999 రూపాయలు కాగా ఇప్పుడు 19,999 రూపాయలకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ క్రోమాటిక్ గ్రే, పెప్పీ పాస్టెల్ లైమ్ రంగుల్లో లభ్యమౌతోంది. 


OnePlus Nord CE 3 Lite ఫీచర్లు


ఈ స్మార్ట్‌ఫోన్ 6.72 ఇంచెస్ ఎల్సీడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రేష్ రేట్ ఉండి క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో అనుసంధానమై ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఇదులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమేరాతో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉండటం వల్ల అద్భుతమైన ఫోటోలు తీయవచ్చు. ఇక సెల్ఫీ లేదా వీడియా కాల్ కోసం 16  మెగాపిక్సెల్ కెమేరా ఉంది. ఇందులో అత్యధికంగా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. టైప్ సి ఛార్జర్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. 


OnePlus Nord CE 3 Lite లో 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ స్టోరేజ్ రెండు స్మార్ట్‌ఫోన్లు 20 వేలకే లభిస్తున్నాయి. ఇది కాకుండా వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 5-10 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఇక ఎక్స్చేంజ్‌పై పాత స్మార్ట్‌ఫోన్ ఇస్తే ధర మరింత తగ్గవచ్చు. 


Also read: Bank Holidays in March 2024: మార్చ్ నెలలో బ్యాంకు సెలవుల జాబితా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook