OPPO A3 Pro 5G Price Dropped: ప్రస్తుతం చాలా మంది తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చిన మొబైల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా మిడిల్‌ క్లాస్‌ కస్టమర్స్‌ అతి తక్కువ ధరల్లో లభించి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా ఎప్పటి నుంచో మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇది బెస్ట్‌ టైమ్‌గా భావించవచ్చు. అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. అదనంగా వాటిపై బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే అమెజాన్‌లో ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన ఏ స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన OPPO A3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. అలాగే అదనంగా బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ వివిధ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. మొదటి బేస్‌ వేరియంట్‌ 8+128 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.17,999 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే రెండవ వేరియంట్‌ 8+256 స్టోరేజ్‌ స్మార్ట్‌ఫోన్‌ రూ.19,999తో అందుబాటులో ఉంది. అయితే ఇందులో బేస్‌ వేరియంట్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌ వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది.


బ్యాంక్‌ ఆఫర్స్‌:
మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర MRP రూ.20,999 కాగా ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో భాగంగా 14 శాతం తగ్గింపుతో కేవలం రూ.17,999కే లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై మరింత తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్స్‌లో భాగంగా HDFC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే, రూ.1199 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి రూ.16,350 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్‌ పొందడానికి ముందుగా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఈ కొత్త OPPO A3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.1,649కే పొందవచ్చు. ఇవే కాకుండా నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి