Oppo F25 Pro 5G Price: అతి చౌకగా 5000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి Oppo F25 Pro మొబైల్..ఫీచర్స్ అన్ని అదుర్స్!
Oppo F25 Pro 5G Price: ఒప్పో నుంచి త్వరలోనే మరో కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo F25 Pro 5G Price: ప్రముఖ టెక్ కంపెనీ ఒప్పో త్వరలోనే గుడ్ న్యూస్ తెలపబోతోంది. వన్‌ప్లస్ కంపెనీ ఫిబ్రవరి 29న భారత మార్కెట్‌లో కొత్త F సిరీస్ స్మార్ట్‌ఫోన్ విడుదల చేయబోతున్నట్లు ప్రటించింది. లాంఛింగ్‌కి ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మైక్రోసైట్ అమెజాన్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చింది. ఒప్పో ఈ మొబైల్‌ను Oppo F25 Pro పేరుతో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. విడుదలకు ముందే దీనికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటో? విడుదల తేది వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఒప్పో కంపెనీ మొదట ఈ Oppo F25 Pro స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే స్టోరేజ్ వేరియంట్‌ను మాత్రమే విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ముందుగా మార్కెట్‌లోకి 8జిబి ర్యామ్, 256జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు లీక్ అయిన వివరాల్లో పేర్కొన్నారు. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ధర విషయానికొస్తే రూ.25,000 నుంచి రూ.30,000 మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
అమెజాన్ మైక్రోసైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం ఈ మొబైల్ పంచ్-హోల్ డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోందిజ అంతేకాకుండా దీని డిస్ప్లే ఇంటిగ్రేటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ మొబైల్‌కి సంబంధించిన డిజైన్, కలర్ ఆప్షన్‌ను కూడా కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది. ఇక దీని బ్యాక్ సెట్ వివరాల్లోకి వెళితే..ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోని రానుంది. ఈ మొబైల్‌ను Oppo Reno 11F 5G స్మార్ట్‌ఫోన్‌కి సక్సెసర్‌గా లాంచ్ చేయబోతున్నట్ల తెలుస్తోంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
Oppo F25 Pro ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే
డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్
పాండా గ్లాస్ డిస్ప్లే ప్రొటెక్షన్
8 GB LPDDR4x ర్యామ్
256 GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్
Mali G68 MC4 GPUతో డైమెన్షన్ 7050 చిప్‌సెట్
LED ఫ్లాష్
64 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌కెమెరా
8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా
2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా
32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ
67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter