Poco F5 Specs Leak: గేమింగ్ స్మార్ట్ ఫోన్ మల్టీ నేషనల్ టెక్ కంపెనీ త్వరలోనే తమ కష్టమర్స్‌కి గుడ్ న్యూస్‌ను తెలపబోతోంది. అతి తక్కువ ధరలోనే మరో ప్రీమియం లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. అలాగే ఈ మొబైల్ POCO F6 మోడల్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు చైనా వార్తా సంస్థలు వెల్లడించాయి. ఇది ఇంతకుముందున్న స్మార్ట్ ఫోన్స్ లాగా కాకుండా అనేక రకాల కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్లు కూడా ఇటీవలే లీక్ అయ్యాయి. అతి తక్కువ ధరలోని ఇది ఎంతో శక్తివంతమైన ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు పలువురు టిప్ స్టర్స్ తెలిపారు. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ POCO F5 స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 SOCతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్ లో గేమింగ్ కోసం అనేక రకాల కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు లీకైన వివరాల ద్వారా తెలుస్తోంది. కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మార్చి 18 లోగా వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ ను ఏప్రిల్‌లోని మొదటి వారంలో కంపెనీ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చైనా వార్తా సంస్థలు వెల్లడించాయి.


IMEI డేటాబేస్‌లో POCO F6 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మొబైల్ గ్లోబల్ వెర్షన్ కోసం 24069PC21G మోడల్ నెంబర్ను పొందినట్లు తెలుస్తోంది. అలాగే భారత్లో ఈ స్మార్ట్ ఫోన్  24069PC21I మోడల్ అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయితే జపాన్ సహా అన్ని దేశాల్లో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా త్వరలోనే విడుదల కాబోయే POCO F6 స్మార్ట్ ఫోన్ Redmi Note 13 మొబైల్ కు రీబ్రాండెడ్ వెర్షన్ గా వచ్చే అవకాశాలు ఉన్నట్లు పలువురు టిప్ స్టర్స్ తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ మొబైల్ ను గ్లోబల్ రిలీజ్ కు ముందే 24069RA21C మోడల్ నెంబర్ తో చైనాలో లాంచ్ చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


పోకో F5 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్:
డిస్ప్లే: 6.67-అంగుళాల AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2400 x 1080 పిక్సెల్ రిజల్యూషన్
ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 87
ర్యామ్‌: 8GB LPDDR5
స్టోరేజ్: 128GB/256GB UFS 3.1
రియర్ కెమెరా: 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ (50MP ప్రైమరీ + 8MP అల్ట్రా-వైడ్ + 2MP మాక్రో)
సెల్ఫీ కెమెరా: 16MP
బ్యాటరీ: 5000mAh, 67W ఫాస్ట్ చార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్: MIUI 13 ఆధారిత Android 12
కనెక్టివిటీ: 5G, Wi-Fi 6, Bluetooth 5.2, USB Type-C
డైమెన్షన్స్: 163.7 x 76.2 x 7.78 మిమీ


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి