Poco x6 neo Launch date in India:  ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం పోకో మరో కొత్త ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతుంది. పోకో ఎక్స్6 నియో పేరుతో ఈ ఫోన్‌ను లాంఛ్  చేయనుంది. రెడ్‌మీనోట్‌ 13ఆర్‌ ప్రో స్మార్ట్‌ ఫోన్‌కు రీబ్రాండెడ్‌గా ఈ ఫోన్ ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. పోకో ఎక్స్‌6, పోకో ఎక్స్‌ ప్రో ఎక్స్‌ ప్రోలో కొనసాగింపుగా ఈ ఫోన్‌ ను మార్చి నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర,ఫీచర్లు గురించి కొన్ని లీక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ స్మార్ట్ ఫోన్‌ 6.67 అంగుళాల డిస్‌ప్లే, 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌రేట్ తో రాబోతుంది.  ఇది మీడియాటెక్‌ డైమెన్సిటీ 6080 ఎస్‌ఓసీ ప్రాసెసర్ తో లాంచ్ కాబోతుంది. ఈ ఫోన్ ఐపీ54 రేట్‌ డస్ట్‌, స్ప్లాష్‌ రెసిస్టెంట్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 3.5 ఎమ్‌ఎమ్‌ ఆడియో జాక్‌ కూడా ఇస్తున్నారు. ఇది 108 మెగాపిక్సెల్స్‌ బ్యాక్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో రాబోతుంది.  ఇది 5,000mAh బ్యాటరీ, 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సెటప్ తో రాబోతుంది. ఇది ఆండ్రాయిడ్ 13-ఆధారిత MIUI 14తో పనిచేస్తుంది. ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, టైమ్ బ్లూ మరియు మార్నింగ్ లైట్ గోల్డ్ కలర్స్ లో తీసుకురాబోతున్నారు. రెడ్‌మీ నోట్‌ 13ఆర్‌ ప్రోకి రీబ్రాండ్‌గా రాబోతున్న ఈ ఫోన్ ధర 23 వేల లోపే ఉండొచ్చని అంచనా. 


Also Read: Sky Drive: ఎగిరే కార్లు వస్తున్నాయి.. ఎంచక్కా ఓలా, ఉబర్‌లా ఆకాశంలో తిరిగేయొచ్చు


Also Read: LPG Gas Cylinder Changes: గ్యాస్ సిలెండర్లపై క్యూఆర్ కోడ్ స్కాన్ , కలిగే ప్రయోజనాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook