Electric Flying Taxis By Maruti Suzuki: సమయం చాలా విలువైనది కావడంతో ప్రజలు ప్రయాణం చేయడానికి ఎక్కువ సమయం వెచ్చించడం లేదు. గమ్య స్థానాలకు వీలైనంత త్వరగా.. వేగంగా వెళ్లేందుకు అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు. అలాంటి వారికి ఎగిరే కార్లు వస్తే ఎంత బాగుంటుంది. ఇప్పటికే విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయి. అవి మన సొంతం కానివి. కానీ ఎగిరే కార్లు వస్తే మాత్రం ఎంచక్కా ఆకాశంలో స్వయంగా నడుపుతూ వెళ్తారు. ఇలాంటి అరుదైన కలను దేశీయ కార్ల దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకి తీర్చనుంది. త్వరలోనే ఎగిరే కార్లను అందుబాటులోకి తీసుకువస్తుందని సమాచారం. ఆ కారును ఎంచక్కా ఇంటిపై పార్కు చేసుకోవచ్చు. రోడ్లపై కాకుండా గాల్లో హాయిగా విహరించవచ్చు.
డ్రోన్ల కంటే పె్దగా.. హెలికాప్టర్ల కన్నా చిన్నగా ఉండే కారులాంటి వాహనం 'ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్'. ఈ వాహనం బరువు 1.4 టన్నులు ఉంటుంది. తక్కువ బరువు ఉండడంతో ఆకాశంలో ఎగరడానికి అత్యంత సులువు కావడంతోపాటు ఇండ్లు, కార్యాలయాలపై పార్కు చేసుకోవచచు. వినియోగదారులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే 'ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్'లను రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే జపాన్‌కు చెందిన సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఈ వాహనంలో మొత్తం నలుగురు ప్రయాణించవచ్చు. ఒక పైలెట్‌తో ముగ్గురు ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంటుంది.
Also Read: FD Interest Rates: సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డిపై అత్యధిక వడ్డీ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే
ఈ వాహనాలను మొదట జపాన్, అమెరికాలో ప్రారంభించనున్నారు. అనంతరం భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. రోడ్డుపై ట్యాక్సీలు ఎలా ఉంటున్నాయో ఆకాశ మార్గంలో అలాంటి మాదిరి 'ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్'లను వినియోగించనున్నారు. ప్రస్తుతం ఈ వాహనాలు రూపొందించడంలో కంపెనీలు బిజీగా ఉన్నాయి. ఒక్కసారి ఈ వాహనాలు ప్రారంభమైతే ప్రజల నుంచి విశేష స్పందన లభించే అవకాశం ఉంది. రోడ్డు మార్గంలో కార్లు, బస్సుల మాదిరి ఆకాశంలో అద్దె ప్రాతిపదికన ప్రయాణించడం ఆసక్తికరంగా మారింది. ఈ వార్త తెలుసుకున్న ప్రజలు 'ఎయిర్ కాప్టర్'లు ఎప్పుడెప్పుడు వినియోగంలోకి వస్తాయా? అని ఎదురుచూస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook