Realme Gt 6 Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ Realme త్వరలోనే గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మరో మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. గతంలో రియల్‌ మీ లాంచ్‌ చేసిన GT సిరీస్‌కి మంచి గుర్తింపు లభించడంతో చాలా మంది ఇదే స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్‌కు ఆప్డేట్ వేరియంట్‌లో కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిపింది. దీనిని కంపెనీ Realme GT 6 పేరుతో అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపింది. దీనిని కంపెనీ జూన్‌ 20వ తేదిన ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే కంపెనీ ప్రకటించింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme GT 6 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అద్భుతమైన ఆఫర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది అద్భుతమైన AI ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీన్ని బట్టి చూస్తే ఇది మొదటి AI ఫోన్ అవుతుందని మార్కెట్‌లో ఇప్పటికే టాక్‌ వినబడబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ Snapdragon 8s Gen 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోంది. ఇక ఈ మొబైల్‌ ధర వివరాల్లోకి వెళితే ధర రూ. 39,999 కంటే తక్కువ ధరలోనే లభిస్తోంది. 


ప్రీ-బుకింగ్ ఆఫర్స్‌ వివరాలు:
ఈ Realme GT 6 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ప్రీ-బుకింగ్ ఆఫర్స్‌ కూడా ప్రారంభమయ్యాయి. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో పాటు ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో జూన్ 24న ప్రీ-బుకింగ్ ప్రారంభమవుతుందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ అందించే మొదటి సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.5,000 వరకు బ్యాంక్ ఆఫర్స్‌ కూడా లభిస్తాయి. దీంతో పాటు కంపెనీ దీనిని మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో తీసుకు రాబోతోంది. ఇందులో మొదటి వేరియంట్‌ 8GB+256GB, రెండు వేరియంట్‌ 12GB+256GB స్టోరేజ్‌తో అందుబాటులోకి వస్తోంది. అయితే ఇక చివరి వేరియంట్‌ 16GB+512GB ఆప్షన్‌లో లభిస్తోంది. దీంతో పాటు కంపెనీ ఈ మొబైల్‌పై 12 నెలల పాటు నో-కాస్ట్ EMIని అందిస్తోంది. దీంతో పాటు  6 నెలల వరకు ఉచిత స్క్రీన్ డ్యామేజ్ ప్రోటక్షన్‌ సెటప్‌ను కూడా అందిస్తోంది. ఇక టాప్‌ వేరియంట్‌ను కొనుగోలు చేసేవారికి  రూ.2999 ధర కలిగిన రియల్‌మీ బడ్స్ ఎయిర్ 5 కూడా ఫ్రీగా అందిస్తోంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


Realme GT 6 స్పెసిఫికేషన్‌లు:
AI ఫ్లాగ్‌షిప్ కిల్లర్‌ ఫీచర్‌
స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్
50-మెగాపిక్సెల్ Sony LYT-808 ప్రధాన కెమెరా
5500mAh డ్యూయల్-సెల్ బ్యాటరీ 
120W SUPERVOOC ఛార్జింగ్ సపోర్ట్
VC శీతలీకరణ
8MP అల్ట్రావైడ్ సెన్సార్‌
50 MP ప్రైమరీ షూటర్‌
32MP సెల్ఫీ షూటర్‌


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి