COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme Festive Days Sale Creates Record: ప్రముఖ టెక్‌ కంపెనీ రియల్‌ మీకి మార్కెట్‌లో ఎంత గుర్తింపు ఉందో అందరికీ తెలిసింది. గుర్తింపుతో పాటు ఈ కంపెనీ మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కూడా ఉంది. ఈ మొబైల్స్‌ అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటాయి. అయితే పండగ సందర్భంగా రియల్‌ మీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో మొబైల్స్‌ను విక్రయించింది. ఈ సేల్‌లో రియల్‌ కంపెనీకి సంబంధించిన అన్ని స్మార్ట్‌ఫోన్స్‌ డెడ్‌ చీప్‌ ధరలకే లభించాయి. 


ఇక సేల్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ధరలకే లభించడంతో కస్టమర్స్‌ ఎక్కువ కొనుగోలు చేసేందుకు మెగ్గు చూపారు. ఈ స్మార్ట్‌ఫోన్స్‌ భారీ తగ్గింపుతో లభించడంతో ఒక్క రోజే 2 లక్షల యూనిట్లకుపై అమ్ముడయ్యాయి. అయితే ఈ సమాచారాన్ని కంపెనీ తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. 5జీకి సంబంధించిన అన్ని స్మార్ట్‌ ఫోన్స్‌ కలిపి ఒక్క రోజే 2 లక్షల యూనిట్ల వరకు విక్రయించిందని వెల్లడించింది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు




అధికారిక వివరాల ప్రకారం..పండగ సేల్‌కి  అద్భుతమైన స్పందన లభించిందని..కంపెనీకి పెద్ద విజయం సాధించని కంపెనీ తమ ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది. Realme ఒక్క వారంలోనే 20 లక్షల యూనిట్లను సేల్‌ చేసిందని తెలిపింది. 5G విప్లవం రియల్‌ మీతోనే ప్రారంభమైందని పేర్కొంది. కంపెనీ మున్ముందు అన్ని రకాల స్మార్ట్‌ ఫోన్స్‌ను మరింత తగ్గింపుతో అందిచబోతున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. సాధరణ వినియోగదారుల కోసం ప్రీమియం స్మార్ట్‌ ఫోన్స్‌ను కూడా అతి తక్కువ ధరలకే అందిస్తారన్నారు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయంTwitter , Facebook