Realme Narzo 70 Pro 5G Price and Features: చైనా స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను ఇవాళ ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. రియల్‌మీ నార్జో 70 ప్రో పేరుతో విడుదల చేసిన ఈ మెుబైల్ లో కొన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ సోనీ ఐఎంఎక్స్ 890 ఓఐఎస్ కెమెరాతో రావడం విశేషం. ఈ ఫోన్స్ ను మార్చి 22 నుంచి అమెజాన్‌, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌లో సేల్ కు ఉంచనున్నారు. దీనిపై భారీ డిస్కౌంట్స్ ను కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మెుబైల్ తోపాటు రియల్‌మీ టీ300 టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌ ఫోన్స్‌ను కూడా ఫ్రీగా ఇవ్వనున్నారు. ఈ క్రమంలో రియల్‌మీ నార్జో 70 ప్రో ఫీచర్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫీచర్స్, ధర వివరాలు...
ఈ 5జీ స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తోపాటు 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది హెచ్ డీఆర్ 10 ఫ్లస్ ను కూడా సపోర్టు చేస్తుంది. 2000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ మీ మెుబైల్ సొంతం. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్ సెట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో స్పెషల్ ఏంటంటే.. ఎయిర్‌ గెశ్చర్స్‌ ఫీచర్‌. దీంతో ఫోన్‌ను ముట్టుకోకుండానే స్క్రీన్‌ షాట్‌ తీయడం, ఇన్‌స్టా రీల్స్‌ పైకి మూవ్‌ చేయడం వంటి 10 రకాల గెశ్చర్స్‌ను చేయొచ్చు. అంతేకాకుండా ఇందులో మరో మైండ్ బ్లోయింగ్ ఫీచర్ కూడా ఉంది. అదే రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్. దీంతో తడి చేత్తోనూ ఫోన్‌ డిస్‌ప్లేను ఆపరేట్‌ చేయవచ్చు. 


ఈ ఫోన్ ను 8జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌/ 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో తీసుకురానున్నారు. 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 18,999కాగా, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 19,999గా నిర్ణయించారు.  మరో 8 జీబీ వరకు వర్చవల్ ర్యామ్ ను పెంచుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సెల్స్‌ ఫ్రంట్ కెమెరా ఉండనుంది. 67 వాట్స్‌ సూపర్ వూక్‌ ఫాస్ట్ చార్జింగ్ తో రాబోతుంది. అంతేకాకుండా ఇది 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ సపోర్టును కలిగి ఉంది. 


Also read: Kia Clavis Price: టాటా కార్లకు ఇక కష్టమే..శక్తివంతమైన ఫీచర్స్‌తో kia clavis వచ్చేస్తోంది.. ఫుల్‌ డిటెయిల్స్‌ ఇవే!  


Also Read: Anchor Vishnu Priya: ఎద అందాలతో మరింత ఉక్కపోత పోయిస్తున్న  విష్ణు ప్రియ.. చాలు బాబోయ్ అంటున్న కుర్రకారు...  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook