Realme GT6: 50MP ప్రైమరీ కెమేరా, 5500 mAH బ్యాటరీతో రియల్ మి కొత్త ఫోన్, లాంచ్ ఎప్పుడంటే
Realme GT6: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజదం రియల్‌మి నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. ఇటీవల చైనాలో లాంచ్ అయిన Realme GT Neo 6 రీబ్రాండ్ వెర్షన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర వంటి వివరాలు తెలుసుకుందాం.
Realme GT6: ఇండియాలో త్వరలో Realme GT6 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవబోతోంది. జూన్ 20న ఇండియా సహా ప్రపంచ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కలిగిన ఈ వెర్షన్ మార్కెట్‌లో హల్‌చల్ చేయనుంది. చైనాలో లాంచ్ అయిన Realme GT Neo 6 ఫీచర్లను పోలి ఉంటుందని అంచనా.
Realme GT6 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ కలిగి ఉంటుంది. 120 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కావడంతో కేవలం 10 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు కేవలం 28 నిమిషాలు పడుతుంది. డ్యూయల్ విసి కూలింగ్ సిస్టమ్ ఫీచర్ ఉంది. దాంతో గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది. మరోవైపు యాంబియెంట్ లైన్ సెన్సార్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ఐపీ 65 రేటింగ్ కలిగి యాంటీ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లతో ఉంటుంది. డ్యూయల్ స్పీకర్లు ఉండటంతో సౌండ్ క్లారిటీ బాగుంటుంది. కనెక్టివిటీ అయితే వైఫై 6, బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది.
Realme GT6 స్మార్ట్‌ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియా కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందో ఇంకా క్లారిటీ రాలేదు. కంపెనీ కూడా ఈ విషయంపై గోప్యత పాటిస్తోంది.
Also read: AP New Cabinet 2024: ఎట్టకేలకు మంత్రిగా పయ్యావుల కేశవ్, ఓడితేనే కాదు గెలిచినా ప్రభుత్వం వస్తుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook