Redmi Note 13 5G Price: అతి తక్కువ ధరలోని ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ను అందించేందుకు ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ రెడ్ మీ ఎప్పుడు ముందుంటుంది. ఇప్పటివరకు కంపెనీ మార్కెట్లో అనేక రకాల ఫీచర్లతో కూడిన బడ్జెట్ మొబైల్స్ ను లాంచ్ చేసింది. ఇలా విడుదల చేసిన స్మార్ట్ ఫోన్స్‌కి మార్కెట్లో మంచి గుర్తింపు లభించింది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ఇటీవలే మార్కెట్లోకి రెడ్ మీ నోట్ 13 5G (Redmi Note 13 5G) స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ కూడా అతి తక్కువ ధరలోనే మూడు స్టోరేజ్ వేరియన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉండడమే కాకుండా వివిధ రకాల కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా అమెజాన్ ఈ స్మార్ట్ ఫోన్ పై సాధారణ కష్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకొని భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో, దీనిపై లభిస్తున్న డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో రెడ్ మీ నోట్ 13 5G (Redmi Note 13 5G) స్మార్ట్‌ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో మొదటి స్టోరేజ్ వేరియంట్ విషయానికొస్తే, 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ప్రస్తుతం మార్కెట్లో రూ.20,999కు అందుబాటులో ఉంది. ఇక రెండవ స్టోరేజ్ వేరియంట్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ రూ. 22,999లకు లభిస్తోంది. ఇక మూడో స్టోరేజ్ ఆప్షన్ విషయానికొస్తే, 12 ర్యామ్, 256 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్ ఫోన్ రూ. 24,999కే లభిస్తోంది. అయితే మొదటి వేరియంట్ విషయానికొస్తే ప్రస్తుతం అమెజాన్‌లో రూ.20 వేల లోపు ధరతో లభిస్తోంది. ఈ మొబైల్ పై ఉన్న డీల్ ఆఫ్ ది డే ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా 14 శాతం తగ్గింపుతో రూ. 17వేల లోపే లభిస్తోంది. అలాగే ఈ మొబైల్ ను అతి తక్కువ ధరకే పొందడానికి ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 


బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, రెడ్ మీ నోట్ 13 5G  (Redmi Note 13 5G) స్మార్ట్ ఫోన్‌ను హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి దాదాపు రూ. వెయ్యి వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా వన్ కార్డు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ. 1500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ స్మార్ట్ ఫోన్ రూ. 16వేల లోపే పొందవచ్చు. ఈ మొబైల్ పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో భాగంగా మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ కు తిరిగి ఎక్స్చేంజ్ చేసి దాదాపు రూ. 17000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను కేవలం ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ.800లోపే మీ సొంతం చేసుకోవచ్చు.


రెడ్‌మీ నోట్ 13 5G స్మార్ట్‌ఫోన్ యొక్క టాప్ ఫీచర్స్:
డిస్‌ప్లే:

6.67" FHD+ AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
240Hz టచ్ శాంప్లింగ్ రేట్
Corning Gorilla Glass 3 ప్రొటెక్షన్


ప్రాసెసర్:
Qualcomm Snapdragon 680 4G SoC
6nm ప్రాసెస్ టెక్నాలజీ


మెమోరీ:
4GB/6GB LPDDR4x RAM
64GB/128GB UFS 2.2 స్టోరేజ్
మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించదగినది


కెమెరా:
50MP ప్రైమరీ కెమెరా
8MP అల్ట్రా-వైడ్ కెమెరా
2MP మాక్రో కెమెరా
13MP సెల్ఫీ కెమెరా


బ్యాటరీ:
5000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ చార్జింగ్


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..
ఇతర ఫీచర్స్:


డ్యూయల్ స్పీకర్ సెటప్
3.5mm హెడ్‌ఫోన్ జాక్
IP53 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్
IR బ్లాస్టర్
MIUI 13 ఆధారంగా Android 12


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి