Reliance Jio Plan: ఇప్పుడు ఎక్కడ చూసినా ఓటీటీ వినియోగమే కన్పిస్తోంది. అందుకే ఓటీటీలను ఆఫర్ చేస్తూ మార్కెట్ పెంచుకునేందుకు టెలీకం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే టెలీకం రంగంలో సత్తా చాటుతున్న రిలయన్స్ జియో..ఓటీటీ ఆఫర్లతో మరింతగా ఆకర్షించేందుకు యత్నిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిలయన్స్ జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్. ఇప్పుడిక జియోతో పాటు అత్యంత ప్రాచుర్యం పొందిన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీని ఉచితంగా పొందవచ్చు. జియో అందిస్తున్న ఈ ఆఫర్ నెట్‌ఫ్లిక్స్ ప్రేమికులకు చాలా ఉపయోగం. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ ఇటీవల పాస్‌వర్డ్ షేరింగ్ నిలిపివేసింది. దాంతో నెట్‌ఫ్లిక్స్ చూడాలంటే తప్పనిసరిగా సబ్‌స్క్రైబ్ చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు రిలయన్స్ జియో అందిస్తున్న ఆఫర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. రిలయన్స్ జియో ప్లాన్‌తో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ అందుతుంది. కాబట్టి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీని హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. 


రిలయన్స్ జియోలో 699 రూపాయల ప్లాన్ ఇది. ఈ ప్లాన్ తీసుకుంటే అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యంతో పాటు 100 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. హైస్పీడ్ డేటా పూర్తయిపోతే 1జీబీకు 10 రూపాయలు ఖర్చుపెట్టాల్సి ఉటుంది. ఈ ప్లాన్‌లో మీరు ముగ్గురిని యాడ్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీ సభ్యుడిని యాడ్ చేస్తే యూజర్లకు 5 జీబీ అదనపు డేటా వస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చు.


రిలయన్స్ జియో అందిస్తున్న 699 ప్లాన్‌తో పలు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కూడా అందుతాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ఓటీటీ సేవలు కూడా పొందవచ్చు. ఇంకా జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు కూడా అందుతాయి. అయితే ఈ ఆఫర్ పోస్ట్ పెయిడ్‌కు మాత్రమే వర్తిస్తుంది. 


Also read: Article 370: ఆర్టికల్ 370 రద్దు చేసే అధికారం పార్లమెంట్‌కు లేదా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook