దేశంలోని ప్రైవైట్ టెలీకం కంపెనీల్లో అతి పెద్దదైన రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. ఇప్పుడు కేవలం 75 రూపాయలకే అత్యంత చౌక ప్లాన్ ప్రవేశపెట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిలయన్స్ జియో టెలీకం కంపెనీ మరో సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ధర కేవలం 75 రూపాయలు. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, డేటాతోపాటు ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. ఇదొక ప్రీ పెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 23 రోజులు. ఈ ప్లాన్‌ను సులభంగా రీచార్జ్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కలిగిన ప్లాన్ ఇది. 


రిలయన్స్ జియో 75 రూపాయల ప్లాన్‌లో 23 రోజుల వరకూ ఏదైనా నెట్‌వర్క్‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 50 ఎస్ఎంఎస్‌లు, 23 రోజులకు కలిపి 2.5 జీబీ డేటా లభిస్తాయి. రోజువారీ డేటా అయిపోతే ఇంటర్నెట్ స్పీడ్ తగ్గి 60 కేబీపీఎస్ ఉంటుంది. ఈ ప్లాన్‌తోపాటు జియో సినిమా, జియో సెక్యూరిటీస్, జియో క్లౌడ్, వంటి జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 


ఈ ప్లాన్ రీఛార్జ్ కోసం మై జియో యాప్ ద్వారా చేయవచ్చు. లేదా జియో అధికారిక వెబ్‌సైట్ నుంచి చేయవచ్చు. ఇంకా గూగుల్ పే, పేటీం, ఫోన్ పే వంటి యూపీఐ చెల్లింపుల ద్వారా చేయవచ్చు. డేటా పెద్దగా అవసరం లేనివారికిక ఈ ప్లాన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు..ఇంతకంటే బెస్ట్ ప్లాన్ మరొకటి లభించదు. 


Also read: UPI Payment: ఇక నుంచి ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ పేమెంట్స్, ఎలాగంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook