Premikudu Re Release: రీ రిలీజ్ కు రెడీ అవుతున్న శంకర్, ప్రభుదేవల సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘ప్రేమికుడు’..

Premikudu Re Release:  ప్రభుదేవ, నగ్మా హీరో హీరోయిన్లుగా  కె.టి.కుంజుమోన్ నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మూవీ 'ప్రేమికుడు'. తమిళంలో 'కాదలన్' పేరుతో తెరకెక్కింది. తెలుగులో ‘ప్రేమికుడు’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు.  1994లో విడుదలైన ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

 

1 /6

రీసెంట్ గా  పాత బ్లాక్ బస్టర్స్ మూవీలను రీ రిలీజ్‌ చేయడమనేది ఎక్కువ అయింది. రీసెంట్ గా మురారి, గబ్బర్ సింగ్ సినిమాలు రీ రిలీజ్ లో మంచి వసూళ్లనే రాబట్టాయి. ఈ కోవలో ప్రభుదేవా హీరోగా నగ్మా హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమికుడు’ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

2 /6

మెగా ప్రొడ్యూసర్ కే. టి.  కుంజుమోన్ ప్రొడ్యూసర్ గా.. సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమికుడు’. ఈ సినిమాకు  ఏ. ఆర్. రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో భారత మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ, అందాల నటి నగ్మా జోడిగా నటించారు.

3 /6

తాజాగా ఈ చిత్రాన్ని రమణ, మురళీధర్ నిర్మాతలుగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ఇతర ముఖ్యపాత్రలో నటించారు. 30 యేళ్ల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ సెప్టెంబర్ 13న థియేటర్లలో ఘనంగా రి రిలీజ్ అవుతోంది.

4 /6

ఎస్. శంకర్ దర్శకత్వంలో  ప్రభుదేవా, నగ్మా జంటగా మూడు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ సినిమా అప్పటి యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలు ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచాయి. ఈ చిత్రంలో ప్రభుదేవా తండ్రి పాత్రలో ఎస్. పి. బాలసుబ్రమణ్యం నటించారు.  

5 /6

ఈ సినిమాలో అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవా తో సమానంగా ఎస్. పి. బాలు  డాన్స్ చేయడం విశేషం. టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ గా నిలిచాయి. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ప్యాన్ ఇండియా లెవల్లో సెన్సెషన్ క్రియేట్ చేసింది.

6 /6

ప్రేమికుడు చిత్రాన్ని జెంటిల్మెన్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై  మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఏ. ఆర్. రెహమాన్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. ఎస్. శంకర్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా సీఎంఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై  మురళీధర్ రెడ్డి, రమణ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.