IRDAI New Rules: ఇకపై 15 రోజుల్లోగా ఇన్సూరెన్స్ క్లెయిం జారీ..ఐఆర్డీఎ కొత్త రూల్స్ ఇవే

Life Insurance Rules: లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ మెంట్ రూల్స్ ను మార్చేసింది ఐఆర్డీఏఐ. కొత్త రూల్స్ ప్రకారం జీవిత బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు ఎలాంటి విచారణ లేకుండానే క్లెయిమ్ దరఖాస్తు పొందన 15 రోజుల్లో బీమా సంస్థలు పరిహారం చెల్లించాల్సిందే. ఐఆర్డీఏఐ కొత్త రూల్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 

Written by - Bhoomi | Last Updated : Sep 8, 2024, 04:28 PM IST
IRDAI New Rules: ఇకపై 15 రోజుల్లోగా ఇన్సూరెన్స్ క్లెయిం జారీ..ఐఆర్డీఎ కొత్త రూల్స్ ఇవే

Health and Life Insurance Rules: జీవితంలో ఎదురయ్యే అనుకోని ఆపదల నుంచి రక్షణ పొందేందుకు, బాధిత కుటుంబానికి భద్రత కల్పించేందుకు జీవిత బీమా అవసరం అవుతుంది. ఇంటిపెద్దను కోల్పోయిన బధలో ఉన్న కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు జీవిత బీమా ఎంతో కాపాడుతుంది. ఊహించని ప్రమాదం ఎదురైనప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ బాధిత కుటుంబానికి కొంత పరిహారం అందిస్తుంది. అలాంటి జీవితా బీమాలో కొన్ని నిబంధనలను మార్చింది ఐఆర్డిఏఐ. ఆ నిబంధనలేంటో చూద్దాం. 

లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు ఎటువంటి విచారణ అవసరం లేనట్లయితే క్లెయిమ్ చేసుకున్న 15రోజుల్లోగా బీమా సంస్థలు పరిహారం చెల్లించాలి. విచారణ అవసరమైన సందర్బాల్లో 45రోజుల్లో క్లెయిమ్స్ సెటిల్ మెంట్ చేయాలని భారతీయ బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది. పాలసీని తీసుకున్నప్పుడు వారం రోజుల్లోగా ఆ మొత్తాన్ని చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. గడువు తీరిన పాలసీలకు వ్యవధి తీరిన రోజు పేమెంట్ పూర్తి చేయాలని మాస్టర్ సర్య్కూలర్ ను జారీ చేసింది. 

నచ్చకుంటే పాలసీ వాపస్ :

ఆరోగ్య, జీవిత బీమా పాలసీలు తీసుకున్న వ్యక్తులు పత్రాలు అందిన నెల రోజుల వరకు ఫ్రీ లుక్ పీరియడ్ రూల్ వారికి వర్తిస్తుంది. పాలసీల నిబంధనలు మీకు నచ్చనట్లయితే ఈ గడువులోపు పాలసీని వెనక్కు ఇచ్చేయవచ్చు. దీనికి ఎలాంటి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు అంగీకరించనట్లయితే అంబుడ్స్ మన్ కు కంప్లెయిట్ చేయవచ్చు. \

Also Read : Thali Price: శాఖాహారం భోజనం  రేటు కంటే..మాంసాహారం భోజనం రేటు తక్కువ..సీన్‌ రివర్స్‌ అయిందేందబ్బా?

ఐఆర్డీఏఐ కొత్త నిబంధనలు ఇవే : 

-కొత్త పాలసీలు ఇచ్చేటప్పుడు బీమా సంస్థలు, తమకు అవసరమైన అదనపు పత్రాలను వారం రోజుల్లోగా అడగాలి. పదిహేను రోజుల్లోగా పాలసీ డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి అందించాలి. 

- బీమా పాలసీ దరఖాస్తుతో పాటు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని ఐఆర్డీఏఐ తెలిపింది. దరఖాస్తు ఆమోదం తెలిపిన తర్వాత ప్రీమియం చెల్లించేందుకు వీలు కల్పించింది. అయితే ప్రీమియం చెల్లించిన వెంటనే  ప్రారంభమయ్యే పాలసీలకు ఈ నిబంధనలు వర్తించవు. 

-బీమా పాలసీలను విక్రయించే వారి గురించి తెలుసుకునేందుకు వీలుగా సంస్థలు తమ వెబ్ సైట్లలో సెర్చ్ టూల్ ను ఏర్పాటు చేసుకోవాలి. 

-జీవిత బీమా పాలసీ తీసుకున్నప్పుడు పాలసీదారులకు ఫ్రీ లుక్ వ్యవధి గురించి సమాచారం ఇవ్వాలి. బీమా పత్రం దరఖాస్తు విషయంలో భర్తీ చేసిన ప్రతిపాదన పాలసీ ప్రయోజనాలతో కూడిన వివరాలను కూడా అందించాలి. 

-కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ ను తప్పనిసరిగా పాలసీదారులకు అందించాలి. ఇందులో పాలసీ రకం, ఎంతవరకు పాలసీ తీసుకున్నారు, పాలసీ రక్షణ కల్పించే విధానం, ప్రయోజనాలు, మినహాయింపులు, క్లెయిమ్ ఎలా చేసుకోవాలి, ఫిర్యాదు చేసేందుకు అంబుడ్స్ మెన్ చిరునామా వంటి వివరాలు ఉండాలి. 

- ఆరోగ్య బీమా పాలసీలకు కూడా ఇలాంటి సీఐఎస్ నే అందించాలి. దీనిలో పాలసీ వివరాలతోపాటు ఉప పరిమితులు, సహా చెల్లింపులు వంటి సమాచారం ఉండాలి. వేచి ఉండే వ్యవధి, ఎలాంటి వ్యాధులకు చికిత్సకు పరిహారం రాదనే వివరాలు కూడా ఇందులో కచ్చితంగా తెలియజేయాలని ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. 

Also Read :  US Recession: అమెరికాలో మాంద్యం చీకట్లు..త్వరలోనే బంగారం తులం లక్ష దాటే ఛాన్స్   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News