COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy A54 5G Price: దక్షిణ కొరియా టెక్ కంపెనీ సామ్‌సంగ్ ప్రతి సంవత్సరం కొత్త సిరీస్‌ల్లో స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఇటీవలే విడుదల చేసిన మిడ్‌ రేంజ్‌ ప్రీమియం A సిరీస్‌ మోడల్స్‌కి ప్రత్యేక గుర్తింపు లభించింది. మార్కెట్‌లో ఈ సిరీస్‌లకి సంబంధించిన విక్రయాలు అధికంగా ఉండడం వల్ల కంపెనీ Galaxy A54 5G మొబైల్‌ను ఇటీవలే మార్కెట్‌ లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ ఈ  Galaxy A54 5G స్మార్ట్‌ ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌ ఫోన్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఏంటో, ఎలా కొనుగోలు చేస్తే డెడ్‌ చీప్‌గా లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


ఫ్లిప్‌కార్ట్‌లో సాంసంగ్‌ Galaxy A54 5G, Galaxy A34 5G స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. కంపెనీ ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ను ప్రారంభ ధర రూ.30,999లతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. సాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో Galaxy A54 5G స్మార్ట్‌ ఫోన్‌ను రూ. 41,999 ధరతో విక్రయిస్తోంది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రం ఈ స్మార్ట్ ఫోన్‌ రూ.3000 తగ్గింపుతో కేవలం రూ.38,999లకే లభిస్తోంది. దీంతో పాటు ఫ్లిఫ్‌కార్ట్‌ అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే ఆఫర్‌ల్‌లో భాగంగా ICICI బ్యాంక్, SBI క్రెడిట్ కార్డ్‌లతో బిల్‌ చెల్లిస్తే రూ.2,000 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ ఫోన్‌ను రూ.36,999లకే పొందవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేస్తే రూ. 1,299 విలువైన 25W ట్రావెల్ అడాప్టర్ కూడా ఉచితంగా లభిస్తుంది. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి


Galaxy A54 5G స్పెసిఫికేషన్‌లు:
6.6 అంగుళాల డిస్‌ప్లే
సూపర్ AMOLED ఫుల్ HD+ డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌
256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌
Exynos 1380 ప్రాసెసర్
50MP ప్రధాన కెమెరా
12MP అల్ట్రా-వైడ్  కెమెరా
32MPసెల్ఫీకెమెరా
5MP మాక్రో సెన్సార్‌ కెమెరా
5000mAh బ్యాటరీ
25W ఛార్జింగ్‌ సపోర్ట్‌
 Android 13 ఆధారంగా OneUI


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి