Samsung Galaxy F54: స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అంతా చైనా ఉత్పత్తులతో నిండిపోయింది. ఒకదాన్ని మించి మరొక ఫీచర్లు, కెమేరా, తక్కువ బడ్జెట్‌తో ఆకట్టుకుంటున్నాయి. అయినా ఇప్పటికీ శాంసంగ్‌దే అగ్రస్థానం. ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేస్తుంటుంది. ఈసారి Samsung Galaxy F54 లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy F54 స్మార్ట్‌పోన్ 6.7 ఇంచెస్ పుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే దిగువన బేజిల్స్ ఉన్నాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటంతో అద్భుతమైన క్లారిటీ, రిజల్యూషన్ ఉంటాయి. గేమింగ్ కోసం కూడా ఈ ఫోన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లుక్ కూడా అద్భుతంగా ఉంటుంది. ధర కూడా తక్కువ కావడంతో మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ ఫోన్ 25 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో యూఎస్‌బి కేబుల్ లభిస్తుంది. అడాప్టర్ మాత్రం విడిగా తీసుకోవల్సి వస్తుంది. 


Samsung Galaxy F54 ఫోన్‌లో 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంటుంది. కెమేరా అయితే కళ్లు తిరిగే రిజల్యూషన్‌తో వస్తోంది. ఇందులో ఏకంగా ప్రైమరీ కెమేరా 108 మెగాపిక్సెల్ ఇచ్చారు. అంతేకాకుండా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉండటం వల్ల ఫోటోలు, వీడియోలు మరింత క్లారిటీగా ఉంటాయి. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్  మ్యాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కేమేరా ఉంటుంది. 


Samsung Galaxy F54 ధర కేవలం 24,999 రూపాయలుంది. అది కూడా 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. 


Also read: Tecno Spark 20: 200MP కెమేరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో టెక్నో స్పార్క్ ఫోన్, ధర చాలా తక్కువే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook