ఉద్యోగుల పంపిణీకి సెప్టెంబర్ 30 డెడ్ లైన్

Last Updated : Aug 29, 2017, 03:12 PM IST
ఉద్యోగుల పంపిణీకి సెప్టెంబర్ 30 డెడ్ లైన్

ఏపీ,తెలంగాణ ఉద్యోగుల పంపిణీ వ్యవహారం సెప్టెంబర్ చివరి కల్లా ఈ ప్రక్రియ పూర్తి కానుంది. విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఉద్యోగుల పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక శాఖలకు చెందిన ఉద్యోగులను వారి వారి రాష్ట్రాలకు బదిలీ చేసిన కమలనాథన్ కమిటీ..మిగిలిన ఉద్యోగులను సైతం పంపిణీ చేసి తన పని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఇరు రాష్ట్రాల సీఎస్ లతో సమావేశమైన కమల్ నాథన్ కమిటీ దీనిపై కసరత్తు చేసింది. మిగిలిన ఉద్యోగుల పంపిణీ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుందని కమల్ నాథన్ కమిటీ అధికారులను ప్రశ్నించింది.

సీనియారిటీకి సంబంధించిన వివాదంపైనే వీరిలో కొందరు కోర్టును ఆశ్రయించారని, సీనియారిటీని ఫైనల్‌ చేసి తుది పంపిణీ చేయాలని కోర్టు తీర్పునిచ్చిందని, దీంతో ఆలస్యమవుతోందని అధికారులు కమిటీకి తెలిపారు. అధికారుల నుంచి సమాధానం రాబట్టిన కమల్ నాథన్ కమిటీ...సెప్టెంబర్ 30 లోగా సీనియారిటీ అంశాన్ని తేల్చి..తుది పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని రెండు రాష్ట్రాల అధికారులకు ఆదేశించింది.

ఇప్పటి వరకు మొత్తం 90 విభాగాలల్లో 153 యునిట్లుగా ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను కమలనాథన్ కమిటీ పూర్తి చేసింది. మొత్తం 55 వేల 870 మంది ఉద్యోగులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పంపిణీ చేయడంతో పాటు తుది కేటాయింపుల జాబితాను కూడా ప్రకటించింది. ఇంకా మిగిలి ఉన్న 1,302 ఉద్యోగుల విషయం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

 

Trending News