Samsung New Smartphones: శాంసంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు, ధర కేవలం 10 వేలే
Samsung New Smartphones: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ డిజైన్ చూస్తే కళ్లు తిప్పుకోలేరు. ఫీచర్లు అద్భతం. అదే సమయంలో ధర చాలా తక్కువ. ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలు ఇలా ఉన్నాయి.
శాంసంగ్ అతి త్వరలోనే ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్ అత్యంత కారుచౌక ధరకు లాంచ్ చేయనుంది. Galaxy A04 మరియు A04e పేర్లతో రానున్న రెండు స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు ఇప్పుడు తెలుసుకుందాం.
శాంసంగ్ కేవలం 10 వేల రూపాయల ధరకు రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేయనుంది. Galaxy A04 మరియు A04e పేర్లతో లాంచ్ కానున్న రెండు స్మార్ట్‌ఫోన్లు ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టడంతో ఫీచర్లు అందరికీ తెలుసు. ఈ రెండు మోడల్ ఫోన్లలో అద్భుతమైన బ్యాటరీ, కెమేరా, లార్జ్ డిస్‌ప్లే ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు ఇండియాలో ఈ వారం లాంచ్ కానున్నాయి.
Galaxy A04 మరియు A04e జీబీ ర్యామ్ వరకూ సపోర్ట్ చేస్తాయి. కస్టమర్ల సౌలభ్యాన్ని బట్టి అదనంగా వర్చువల్ ర్యామ్ జోడించేందుకు వీలుంటుంది. లాంచ్ డేట్ గురించి అధికారికంగా ఇంకా ఏ ప్రకటనా విడుదల కాలేదు కానీ ఈ వారంలో లాంచ్ కావచ్చనేది అంచనా. రెండు ఫోన్లలో 6.5 ఇంచెస్ ఎల్‌సిడీ డిస్‌ప్లే ఉంటుంది. దాంతో పాటు 60 హెర్ట్జ్ రిఫ్రెష్‌రేట్, హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్ ఉంటుంది. రెండింట్లోనూ సెల్ఫీకెమేరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. Galaxy A04లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఉండే Galaxy A04eలో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా ఉంటుంది. ఇక రెండింట్లోనూ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారంగా పనిచేస్తాయి.
రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ప్రత్యేకత. ఇది కాకుండా డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.0 వెర్షన్, జీపీఎస్, యూఎస్ బి-సీ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లభిస్తాయి.
Also read: Jobs Alert: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, కేంద్రీయ విద్యాలయాల్లో భారీగా రిక్రూట్‌మెంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook