Cheapest Smartphones: త్వరలో చౌక ధరకే స్మార్ట్‌ఫోన్స్.. కారణం ఏంటో తెలుసా?
Smartphones Going Get Cheaper Soon. 5G స్మార్ట్‌ఫోన్‌ల దృష్టిలో ఉంచుకుని.. పలు కంపెనీలు రానున్న నెలల్లో 4G స్మార్ట్‌ఫోన్‌ల ధరలను భారీగా తగ్గించే అవకాశం ఉంది.
4G Smartphone Price Likly to Drop Very Soon: మీరు ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు ప్లాన్ చేస్తున్నారా?.. అయితే చాలా తక్కువ ధరలో మంచి స్మార్ట్‌ఫోన్‌ను మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.అయితే మీరు కొంత సమయం వేచి ఉండాల్సి ఉంది. నిజానికి ఇప్పుడు మైబైల్ మార్కెట్లో మొత్తం 5G స్మార్ట్‌ఫోన్‌ల హవా నడుస్తోంది. దాంతో ఖరీదైన 4G స్మార్ట్‌ఫోన్‌ల ధర ప్రతిరోజుకు తగ్గుతూ వస్తోంది. 5G స్మార్ట్‌ఫోన్‌ల దృష్టిలో ఉంచుకుని.. పలు కంపెనీలు రానున్న నెలల్లో 4G స్మార్ట్‌ఫోన్‌ల ధరలను భారీగా తగ్గించే అవకాశం ఉంది.
5G స్మార్ట్‌ఫోన్‌ల కారణంగానే 4G స్మార్ట్‌ఫోన్‌ల ధరలు తగ్గడంతో పాటు అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని కారణంగా మీరు చాలా సరసమైన ధరలో స్మార్ట్‌ఫోన్‌ను పొందుతారు. మీరు కూడా ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయబోతున్నట్లయితే.. మీకు బాగా ఉపయోగపడే పాయింట్లను ఇప్పుడు చూద్దాం.
స్మార్ట్‌ఫోన్ తయారీదారు కంపెనీలు తమ పాత 4G స్మార్ట్‌ఫోన్‌లను 5G స్మార్ట్‌ఫోన్‌లతో భర్తీ చేస్తున్నాయి. అందుకే త్వరలో 4G స్మార్ట్‌ఫోన్‌ల ధరలలో భారీ తగ్గింపు ఉండవచ్చు.
లిథియం నిల్వలను భారీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాబోయే కాలంలో స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే బ్యాటరీల ధరలు తగ్గుతాయి. ఇది స్మార్ట్‌ఫోన్‌ల ధరలను కూడా ప్రభావితం చేస్తుంది.
ఇటీవల జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతంలో లిథియం యొక్క పెద్ద నిల్వ కనుగొనబడింది. ఫోన్ బ్యాటరీలను తయారు చేయడానికి ఈ లిథియం ఉపయోగించబడుతుంది. కాబట్టి ఇప్పుడు లిథియం విదేశాల నుండి దిగుమతి అవసరం లేదు.
దిగుమతి సుంకం కారణంగా ధరలు తగ్గే స్మార్ట్‌ఫోన్‌లలో సామ్‌సంగ్ కూడా ఉంది. అంతేకాదు భారతీయ మార్కెట్లో అనేక ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను అందించే కొన్ని ఇతర కంపెనీలు ఉన్నాయి.
ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించే విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గుతుంది. ఇది జరిగితే ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ల ధర ఆటోమేటిక్‌గా తగ్గుతుందని ఇటీవల సమర్పించిన బడ్జెట్‌లో కూడా చెప్పబడింది. కొనుగోలు చేయడానికి, వినియోగదారులు మునుపటి కంటే చాలా తక్కువ ధర చెల్లించాలి.
Also Read: Hyundai 7 Seater Car: ఇక సఫారీని మరచిపోవాల్సిందే.. బెస్ట్ 7 సీట్ కారు వచ్చేసింది! ధర కూడా తక్కువే
Also Read: Old Pension Scheme: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెన్షన్ విధానంలో కీలక మార్పులు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.