Old Pension Scheme: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెన్షన్‌ విధానంలో కీలక మార్పులు..?

OPS Vs NPS: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ అన్ని వైపులా వస్తుండడంతో కీలక మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. కొత్త పెన్షన్ విధానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది..? ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి..? వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2023, 08:28 PM IST
Old Pension Scheme: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెన్షన్‌ విధానంలో కీలక మార్పులు..?

OPS Vs NPS: పాత పెన్షన్ మళ్లీ పునరుద్దరించాలని దేశవ్యాప్తంగా ఉద్యోగుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. కొత్త పెన్షన్ విధానంతో పోలిస్తే.. చాలా రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానమే అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఉద్యోగుల నుంచి భారీగా డిమాండ్ వస్తుండడంతో ఓపీఎస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త పెన్షన్ విధానంలో అనేక రాయితీలు ఇవ్వడాన్ని మోదీ ప్రభుత్వం ఒకే చెప్పే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పెన్షన్ వ్యవస్థను సంస్కరించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని నిపుణులు చెబుతున్నారు. 

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో కొత్త పెన్షన్ విధానానికి స్వస్తి పలికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం పడకుండా.. ప్రస్తుతం ఉన్న పెన్షన్ విధానంలో మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. తద్వారా ఉద్యోగులు ఎలాంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని విశ్వసిస్తున్నాయి. దీంతో పాటు వారికి పింఛన్‌ నష్టపోకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కొత్త పెన్షన్ స్కీమ్ ప్రకారం.. ఉద్యోగి పదవీ విరమణ సమయంలో.. పని సంవత్సరాలలో డిపాజిట్ చేసిన మొత్తంలో 60 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది పూర్తిగా పన్ను రహితం. మిగిలిన 40 శాతం యాన్యుటీలో పెట్టుబడి పెడతారు. 

కొత్త పెన్షన్ స్కీమ్‌తో సమస్య ఏంటి..?

రిటర్మైంట్ సమయంలో ఉద్యోగులు భారీ మొత్తంలో.. దాదాపు 41.7 శాతం కంట్రిబ్యూషన్‌ను ఒకేసారి తిరిగి పొందే విధంగా ప్రభుత్వం ఎన్‌పీఎస్‌లో మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మోడల్ ఓపీఎస్‌కి వ్యతిరేకమని.. అదే ఏకైక సమస్య అని ఉద్యోగులు అంటున్నారు. కొత్త, పాత పెన్షన్ స్కీమ్ మధ్య చాలా వ్యత్యాసం ఉందని.. దీని కారణంగా ఉద్యోగులు, పెన్షనర్లు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఓపీఎస్‌లో పదవీ విరమణ సమయంలో.. ఉద్యోగులు పెన్షన్‌గా సగం జీతం పొందుతారు. అదేసమయంలో కొత్త పెన్షన్ స్కీమ్‌లో ఉద్యోగి బేసిక్ శాలరీ 10 శాతం +డీఏ మినహాయిస్తాయిరు. పాత పెన్షన్ స్కీమ్‌లోని ప్రత్యేకత ఏమిటంటే.. ఉద్యోగుల జీతం నుంచి డబ్బు తీసివేయరు. అంతేకాకుండా కొత్త పింఛనులో 6 నెలల తర్వాత డీఎ పొందాలనే నిబంధన లేదు. ఇది కాకుండా పాత పెన్షన్ చెల్లింపు ప్రభుత్వ ఖజానాపై ఎక్కువ భారం పడుతుంది. అదే సమయంలో కొత్త పెన్షన్‌లో స్టాండర్డ్ పెన్షన్‌కు హామీ లేదు. 

ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌లో రిటైర్డ్ ఉద్యోగి మరణించిన తర్వాత కూడా అతని కుటుంబ సభ్యులకు పెన్షన్ వస్తుంది. ఉదాహరణకు.. ఒక ఉద్యోగి ఇప్పుడు రూ.80 వేల జీతం పొందుతున్నట్లయితే.. పదవీ విరమణ తర్వాత దాదాపు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు పెన్షన్ లభిస్తుంది. 

 

Also Read: TSRTC Bus: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి నో టెన్షన్  

Also Read: Gujarat Earthquake: గుజరాత్‌లో కంపించిన భూకంపం.. భయపెడుతున్న వరుస ఘటనలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News