Telegram New Feature: ఆధునిక జీవన విధానంలో సోషల్ మీడియా పాత్ర కీలకంగా ఉంది. సోషల్ మీడియా వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్ యూజర్లు పెరుగుతున్నారు. అత్యంత సులభంగా, అనువుగా ఉండేది కావడంతో వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా టెలీగ్రామ్ ఉపయోగం పెరుగుతోంది. టెలీగ్రామ్ ఇటీవల కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం టెలీగ్రామ్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ టెలీగ్రామ్ వెర్షన్ 7.4 నుంచే అందుబాటులో ఉంటుంది. పాత వాటికి వర్తించదు. ఐవోఎస్ వినియోగదారులకు ఇంకా అందుబాటులో రాలేదు. ఈ ఫీచర్ ద్వారా మీ వాట్సప్ చాట్ మొత్తాన్ని చాలా సులభంగా టెలీగ్రామ్‌కు బదిలీ చేసుకోవచ్చు.


ముందుగా మీరు వినియోగించే టెలీగ్రామ్‌ను 7.4 లేదా ఆ తరువాత వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. ఇప్పుడు వాట్సప్ ఓపెన్ చేసి, ఏ చాట్ బదిలీ చేయాలో దానిని ఎంచుకోవాలి. పై భాగంలో కన్పించే ప్రొపైల్ పిక్‌పై ప్రెస్ చేయాలి, తరువాత కాంటాక్ట్ ఇన్ఫో పేజ్ ఓపెన్ చేయాలి. అక్కడ కన్పించే ఆప్షన్లలో మోర్ లేదా త్రీ డాట్స్ ఐకాన్ క్లిక్ చేయాలి. తరువాత ఎక్స్‌పోర్ట్ చాట్ ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత విత్ మీడియా , వితౌట్ మీడియా ఆప్షన్లలో ఒకటి ఎంపిక చేసుకోవాలి. 


షేర్ మెనూలో టెలీగ్రామ్ ఆప్షన్ ప్రెస్ చేయాలి. తరువాత మీరు ఎంపిక చేసిన వాట్సప్ చాట్ టెలీగ్రామ్‌లో కన్పిస్తుంది. ప్రతి మెస్సేజ్ దిగువున ఇంపోర్టెడ్ మార్క్ చూడవచ్చు.


Also read: Redmi Smart tv: 4కే రిజల్యూషన్‌తో 42 వేల టీవీ ఇప్పుడు కేవలం 23 వేలకే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook