Sony Launch Sony Xperia 1 V in Japan on 2023 May 11: భారతీయ మొబైల్ మార్కెట్‌లో జపాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ 'సోనీ'కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎప్పటినుంచో కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. భారీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లనే కాకుండా.. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే సోనీ మరో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. సోనీ ఎక్స్‌పీరియా 1 వీ (Sony Xperia 1 V) స్మార్ట్‌ఫోన్‌ను మే 11న జపాన్‌లో విడుదల చేయనుంది. ఈ ఫోన్ గతేడాది విడుదలైన ఎక్స్‌పీరియా 1 ఐవీ (Xperia 1 IV)కి కొనసాగింపుగా రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sony Xperia 1 V Price:
ఇటీవల సోనీ ఎక్స్‌పీరియా 1 వీ స్మార్ట్‌ఫోన్‌ డిజైన్ మరియు మరింత ముఖ్యమైన సమాచారం బిల్‌బోర్డ్‌లో వెల్లడైంది. చైనా మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర లీక్ అయింది. ఓ నివేదిక ప్రకారం సోనీ ఎక్స్‌పీరియా 1 వీ స్మార్ట్‌ఫోన్ ధర చైనాలో RMB 8,000 (భారత కరెన్సీలో సుమారు 94 వేల రూపాయలు) ఉంటుంది. గత సంవత్సరం విడుదల చేసిన Xperia 1 IV ధర RMB 8,499 (రూ. లక్ష) కంటే ఈ స్మార్ట్‌ఫోన్ ధర తక్కువగా ఉంటుందని స్పష్టం అయింది. ఎక్స్‌పీరియా ఫోన్‌లు చైనాలో బాగా ప్రాచుర్యం పొందాయి. అందువల్ల ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లపై భారీగా ధరలను సోనీ కంపెనీ నిర్ణయిస్తోంది.


Sony Xperia 1 V Features:
గ్లోబల్ మార్కెట్లలో సోనీ ఎక్స్‌పీరియా 1 వీ స్మార్ట్‌ఫోన్‌ ధర చైనాలో మాదిరి ఉందని సమాచారం. ఈ ఫోన్ ధర ఇదివ వరకు వచ్చిన ఎక్స్‌పీరియా 1 ఐవీ మాదిరిగానే ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా ఉంటుంది. ఎందుకంటే ఈ స్మార్ట్‌ఫోన్‌లో అప్‌గ్రేడ్‌లు చాలానే ఉంటాయి. ఎక్స్‌పీరియా 1 వీ నూతన సెన్సార్‌లు మరియు ఇమేజింగ్‌ను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. అదనంగా తక్కువ-నాయిస్ సెన్సార్ టెక్స్ట్ కూడా ఉంటుందట. ఇది అన్ని లైటింగ్ పరిస్థితులలో అధిక-నాణ్యత చిత్రాలను షూట్ చేయగలదు. 


Sony Xperia 1 V Design:
సోనీ ఎక్స్‌పీరియా 1 వీ స్మార్ట్‌ఫోన్ డిజైన్ లీక్ అయింది. లీకుల ప్రకారం ఈ ఇది స్మార్ట్‌ఫోన్ వైట్, బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుందట. సోనీ ఎక్స్‌పీరియా 1 వీ యొక్క ముఖ్య లక్షణాలలో 120Hz 6.5-అంగుళాల 4K HDR OLED డిస్ప్లే ఒకటి. 16GB RAMతో జత చేయబడిన స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCని కలిగి ఉండవచ్చని సమాచారం తెలుస్తోంది.


Also Read: RCB IPL Titles: అతడు కెప్టెన్‌గా ఉండి ఉంటే.. ఆర్‌సీబీ మూడు ఐపీఎల్‌ టైటిల్స్ గెలిచేది: వసీమ్ అక్రమ్‌  


Also Read: SRH Records: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. టాప్ రికార్డ్స్ ఇవే!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.