COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo X100 Pro Price: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో మార్కెట్లోకి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా అతి శక్తివంతమైన ఫీచర్స్ తో కలిగిన స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను వివో ఎక్స్ 100 పేరుతో విడుదల చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మొబైల్ వివో ఇంతకు ముందు విడుదల చేసిన స్మార్ట్ ఫోన్స్ కంటే భిన్నంగా ఉండబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మొబైల్ చైనా మార్కెట్లో అందుబాటులో ఉంది. భారత్లో అతి త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు వివో వెల్లడించింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రస్తుతం చైనా మార్కెట్లో ఈ వివో ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్ మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒక వేరియంట్ వివో ఎక్స్ 100 (Vivo X100) అయితే మరొకటి వివో ఎక్స్ 100 ప్రో(Vivo X100 PR0) వేరియంట్‌లో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పటికీ చైనాలో 10 లక్షల మందికి పైగా కొనుగోలు చేశారు. అంతేకాకుండా డిమాండ్ పెరగడంతో వివో కూడా ఫ్రీ బుకింగ్ ఆర్డర్స్ ను ప్రకటించింది. మొదటి విక్రయాల్లోనే ఈ మొబైల్స్ రికార్డ్ బ్రేకింగ్ చేయడం వల్ల అతి త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్న కంపెనీ ప్రకటించింది. కంపెనీ ఇప్పటికీ మొదటి సేల్ ద్వారా దాదాపు రూ. 1,168 కోట్ల వరకు సంపాదించినట్లు వెల్లడించింది. 


వివో ఎక్స్ 100 స్మార్ట్ ఫోన్ ధరలు:
16GB+1TB - సుమారు రూ. 58,418
16GB+512GB- సుమారు రూ. 53,743
12GB+256GB- సుమారు రూ. 46,732
16GB+256GB- సుమారు రూ. 50,238


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  


వివో ఎక్స్ 100 ప్రో స్మార్ట్ ఫోన్ ధరలు:
12GB+256GB- సుమారు రూ. 58,418
16GB+256GB- సుమారు రూ. 61,924
16GB+512GB- సుమారు రూ. 64,261
16GB+1TB- సుమారు రూ. 70,104 


ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్:
ఈ రెండు స్మార్ట్ ఫోన్లు 6.78 అంగుళాల OLED ALTPO డిస్ప్లేను కలిగి ఉంటాయి. ఈ డిస్ప్లే 120 HZ రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ వరకు సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌తో పాటు 16GB RAM + 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్స్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా OriginOS 4పై పని చేస్తాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్స్‌ ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, IP68-రేటెడ్ బాడీతో రాబోతోంది. దీంతో పాటు  120W ఛార్జింగ్‌ సపోర్ట్‌తో  5,000 mAh బ్యాటరీని ప్యాక్‌ను కలిగి ఉంటుంది.  


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook