COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo X100 Launch Date: ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్ ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా అతి చౌకగా ఎక్కువ ఫీచర్స్‌తో లభించే కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ ఫోన్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. అయితే ఇదే తరహాలో వీవో త్వరలోనే మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ మొబైల్‌ను కంపెనీ Vivo X100 సిరీస్‌లో విడుదల చేసేందుకు కంపెనీ యోచిస్తోంది. Vivo కంపెనీ ఈ మొబైల్‌ లాంచింగ్‌ తేదిని వెల్లడించింది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Vivo తమ కొత్త స్మార్ట్ ఫోన్‌ను రాబోయే కొత్త సంవత్సరంలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ Vivo X100 సిరీస్‌ మొబైల్‌ను జనవరి మొదటి వారంలో లాంచ్‌ చేయబోతున్నట్లు వెల్లడించింది. వీవో కంపెనీ ఇప్పటికే చైనాలో Vivo X100, Vivo X100 ప్రోలను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను వీవో నవంబర్ నెలలో MediaTek Dimensity 9300 ప్రాసెసర్‌తో లాంచ్‌ అయింది. ఇవే కాకుండా చాలా రకాల ఫీచర్స్‌తో మార్కెట్‌లో అందుబాటు ఉంది. 


భారతదేశంలో లాంచింగ్‌ తేది ఖరారు:
ఈ Vivo X100 స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించి లాంచింగ్‌ తేదిని వెల్లడించింది. ఈ మొబైల్‌ సిరీస్‌లను జనవరి 4న భారత మార్కెట్‌లో విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. మొదట ఈ స్మార్ట్‌ ఫోన్‌లను ఆస్టరాయిడ్ బ్లాక్, స్టార్‌ట్రైల్ బ్లూ, సన్‌సెట్ కలర్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ రెండు వేరియంట్‌లో Funtouch OS 14లో అందుబాటులో ఉంటుంది. 


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


భారతదేశంలో Vivo X100 సిరీస్ ధర:
ఇటీవలే లీకైన వివరాల ప్రకారం..ఈ స్మార్ట్ ఫోన్‌ చైనాలో ధర CNY 4,999తో లభిస్తోంది. భారత్‌లో దాదాపు రూ. 56,500 ఉండే అవకాశాలున్నాయని టిప్‌స్టర్స్‌ తెలిపారు. ఇక రెండవ వేరియంట్‌ విషయానికొస్తే  ధర CNY 3,999తో చైనాలో లభిస్తోంది. అయితే భారత మార్కెట్‌లో దీని ధర దాదాపు రూ. 50,000 ఉండే ఛాన్స్‌ ఉంది. హై ఎండ్‌ Vivo X100 సిరీస్‌ స్మార్ట్ ఫోన్‌ రూ. 60 వేలలోపే లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ధరకు సంబంధించిన అధికారిక సమచారం కోసం తప్పకుండా వేచి చూడాల్సిందే..


Vivo X100 సిరీస్ స్పెసిఫికేషన్‌లు:
ఈ Vivo X100 స్మార్ట్‌ ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌, ఫీచర్ల వివరాల్లోకి వెళితే..Vivo X100 సిరీస్ భారతదేశంలో కర్వ్డ్ డిస్‌ప్లేతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల 8 LTPO AMOLED స్క్రీన్‌ను కలిగి ఉండబోతోంది. ఈ Vivo X100, Vivo X100 Pro మొబైల్స్‌ MediaTek డైమెన్సిటీ 9300 SoC ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఈ మొబైల్స్ Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లను కలిగి ఉంటుంది.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter