Whatsapp Status Like Feature: ప్రస్తుతకాలంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగించిన వారంటూ ఉండరు. అందులో ముఖ్యంగా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్ బుక్ , యూట్యూబ్, గూగుల్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. అంతేకాకుండా  మన దినచర్యలో జరిగే పనుల గురించి స్టేటస్ రూపంలో లేదా పోస్టు రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వాట్సాప్ లో చేసే రచ్చ అంత ఇంత ఉండదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాట్సాప్  ఒక ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్. దీన్ని ఉపయోగించి మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, దూరదేశంలో ఉండే వాళ్ళని కూడా సులువుగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో  వీడియో కాల్స్, గ్రూప్స్ కి వాట్సాప్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం వాట్సాప్ లో కొత్త అప్డేట్స్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల వాట్సప్ స్టేటస్ లో కూడా ఒక కొత్త అప్డేట్ ని తీసుకువచ్చింది ఇంతకీ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఇది వరకు మనకు ఏదైనా పోస్ట్ కానీ ఫొటోస్ నచ్చితే ఇంస్టాగ్రామ్ లో లైక్ సెక్షన్ ని యూస్ చేసేవాళ్ళం అలాగే వాట్సాప్ లో కూడా ఇప్పుడు ఒక ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది.  ఈ ఫీచర్ ఉపయోగించి మనకు నచ్చిన స్టేటస్ కి లైక్ ని టాప్ చేయవచ్చు. 


ఇది వరకు మనం వాట్సాప్‌లో ఎవరైన మంచి ఫొట్స్‌, వీడియోలు, కొట్స్‌ షేర్‌ చేస్తే చూసి రిప్లై చేసేవాళ్ళం. కానీ ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం లైక్‌, షేర్‌ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీరు ఇప్పుడు వాట్సాప్ లో కూడా చేయవచ్చని మీకు తెలుసా?


దీన్ని ఎలా ఉపయోగించాలి 


ముందుగా మీ ఫోన్‌లో వాట్స్అప్ యాప్ ని ఓపెన్ చేయాలి. అందులో స్టేటస్ ఆప్షన్ పైన టాప్ చేయాలి. ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళ స్టేటస్ ని ఓపెన్ చేస్తే రిప్లై పక్కన ఒక హాట్ సింబల్ అంటుంది. దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీకు నచ్చిన ఏ స్టేటస్ మీద లైక్ చేయవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.


వాట్సాప్‌లో లైక్‌ కనిపించటం లేదా?


మీ వాట్సాప్‌లో లైక్‌ కనిపించటం లేదంటే. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్‌ చేయండి. ఇందులో వాట్సాప్‌ యాప్‌ను సర్చ్‌ చేయండి. తరువాత వాట్సాప్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేయండి. ఇప్పుడు వాట్సాప్‌ ఓపెన్‌ చేస్తే సరిపోతుంది. లైక్‌ సింబల్‌ కనిపిస్తుంది.  ఈ సింపుల్‌ టిప్స్‌తో మీకు నచ్చిన ఫొటో, వీడియోను లైక్‌ చేయండి. 


ఇది కూడా చదవండి: Jio Phone Prima 2 Price: జియో నుంచి అద్భుతమైన JioPhone Prima 2 4G మొబైల్‌.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.