WhatsApp Call-back Button: ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్‌తో వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది వాట్సాప్. త్వరలోనే మరో కొత్త అప్‌డేట్‌తో రానుంది. మిస్డ్ కాల్స్ కోసం త్వరలో కొత్త కాల్-బ్యాక్ సర్వీస్‌ను ప్రారంభించబోతోంది. ఈ ఫీచర్‌ను విండోస్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ అప్‌డేట్ ద్వారా వాట్సాప్‌లో మిస్డ్ కాల్‌లను సులభంగా ట్రేస్ చేయవచ్చు. ఆ నంబర్లకు తిరిగి కాల్ చేయవచ్చు. ఈ కొత్త కాల్ బ్యాక్ సేవను వినియోగించడానికి మైక్రోసాఫ్ట్ స్టోర్‌లోకి వెళ్లి వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. అనంతరం ఈ కొత్త కాల్-బ్యాక్ సేవను ఉపయోగించి ఎంజాయ్ చేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందుకోసం వాట్సాప్‌లో కొత్త కాల్ బ్యాక్ బటన్‌ను యాడ్ చేసింది. మిస్డ్ కాల్ హెచ్చరికతో సందేశాన్ని చూపిస్తుంది. ఈ కొత్త బటన్‌కు కాల్ బ్యాక్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ బటన్‌పై నొక్కి.. మిస్ట్ ఆ వ్యక్తికి కాల్ చేయవచ్చు. కాల్ బ్యాక్ బటన్ చాట్‌లోనే కనిపించనుంది. మీరు ఇందుకోసం వెతకాల్సిన అవసరం ఉండదు. ఈ కొత్త కాల్ బ్యాక్ ఫీచర్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఈ కొత్త అప్‌డేట్‌తో మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందనున్నాయి.


అయితే ప్రస్తుతం ఈ అప్‌డేట్ ఎంపిక చేసిన బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ లేటెస్ట్ వెర్షన్ టెస్టింగ్ దశలో ఉంది. టెస్టింగ్ పూర్తవ్వగానే.. క్రమంగా వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుంది. మీరు మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో ఈ అప్‌డేట్ మీకు ఇంకా అందుబాటులోకి రాకపోతే.. మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. తాజా అప్‌డేట్‌తో వాట్సాప్ బీటా విండోస్ వెర్షన్ 2.2323.1.0 యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.


Also Read: Adipurush Twitter Review: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ రియాక్షన్ ఇదే..


బీటా టెస్టర్ల కోసం వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లను రిలీజ్ చేయనుంది. కాల్ బ్యాక్ బటన్‌తో పాటు స్క్రీన్ షేరింగ్ ఫీచర్, ఎడిట్ బటన్ ఫీచర్ కూడా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకుముందు ఈ ఫీచర్‌లు బీటా యూజర్‌లకు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చాయి. యూజర్లకు మరిన్ని ఫీచర్లతో అప్‌డేట్స్‌ను తీసుకువచ్చేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. భవిష్యత్‌లో రానున్న ఫీచర్లతో వినియోగదారులు చాట్‌లను ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాల్‌లు చేయడానికి, మరింత ప్రొఫెషనల్, సహజమైన రీతిలో స్క్రీన్ షేర్ చేయడానికి పర్మిషన్స్ ఉంటాయి.  


Also Read: TS Gurukul Recruitment 2023: అభ్యర్థులకు ముఖ్యగమనిక.. 9,231 ఉద్యోగ ఖాళీలకు పరీక్షలు ఎప్పుడంటే..!



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి