WhatsApp to Replace Phone Numbers with User Names: వాట్సాప్ వాడే వారి కోసం ఒక కొత్త అప్డేట్ తెర మీదకు వచ్చింది.  నిజానికి ఏదైనా వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ అయిన తర్వాత మీకు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు, అది ఎవరి నెంబర్ అని మీరు కనుగొన లేక పోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతుంటే ఇక ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు. అదేమంటే వాట్సాప్ గ్రూప్ సభ్యుల కోసం కొత్త అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం దీనిలో ఫోన్ నంబర్ వాడే వారి పేరుతో అక్కడ మేన్షన్ చేయబడి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంటే ఈ కొత్త అప్‌డేట్ తర్వాత, వాట్సాప్ గ్రూప్‌లో తెలియని వ్యక్తి నుండి మెసేజ్ వచ్చినప్పుడు, వినియోగదారులు ఫోన్ నంబర్‌కు బదులుగా అవతలి వ్యక్తి పేరును చూస్తారన్న మాట. అయితే ఈ అప్‌డేట్ గ్రూప్ చాట్‌ల కోసం మాత్రమే పని చేస్తుంది, వ్యక్తిగత చాట్‌ల కోసం కాదు అని అంటున్నారు. 


ఈ అప్డేట్ వల్ల ప్రయోజనం ఏమిటి..? 


ఈ అప్‌డేట్ చాలా పెద్దది కాదు అని చెప్పవచ్చు. కానీ ఈ అప్‌డేట్ తర్వాత, మెసేజ్ ఎవరు పంపారో వినియోగదారులకు సులభంగా తెలుస్తుంది. ఇప్పుడు కాంటాక్ట్‌లో ఉన్న ప్రతి నంబర్‌ను సేవ్ చేయడం సాధ్యం కాదు కదా. మరీ ముఖ్యంగా మీరు పెద్ద గ్రూప్ లో ఉన్నప్పుడు ఈ ఫీచర్ గ్రూప్ చాట్‌ల కోసం మాత్రమే పని చేస్తుంది. అలాగే ఈ ఫీచర్ గ్రూప్‌లోని సభ్యుల జాబితాను చూసేటప్పుడు కూడా పని చేస్తుంది. వాట్సాప్ తెచ్చిన ఈ తాజా అప్‌డేట్ తెలియని నంబర్‌ల నుండి సందేశాలను పంపినవారు ఎవరో అర్థం చేసుకోవడం వినియోగదారులకు సులభతరం చేస్తుంది. 


ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందా..?


ప్రస్తుతానికి, ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం తాజా వాట్సాప్ వెర్షన్ 2.23.5.12 బీటా తో పాటు iOS బీటా కోసం iOS 23.5.0.73 అప్‌డేట్‌తో కొంతమంది బీటా వినియోగదారుల కోసం ఈ ప్రత్యేక ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. టెస్టింగ్ పూర్తయిన తర్వాత, ఫీచర్ ఇతర వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తుంది. ఇక  వాట్సాప్ గ్రూప్‌ల కోసం మరో కొత్త ఫీచర్‌ను కూడా టెస్ట్ చేయడం ప్రారంభించింది. ఇక ఈ కొత్త అప్డేట్ గ్రూప్ అడ్మిన్‌లకు గ్రూప్‌పై మరింత కమాండింగ్ ఇస్తుంది. ఈ కొత్త ఫీచర్ గ్రూప్ ఇన్‌వైట్ లింక్ ద్వారా గ్రూప్‌లో ఎవరు చేరవచ్చో గ్రూప్ అడ్మిన్‌ని కంట్రోల్ చేయడానికి అనుమతిస్తుందని అంటున్నారు. 


Also Read: Allu Arjun Trolled: ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్.. చరణ్ లవ్లీ బ్రదరేనా? ఇదేం తేడా బన్నీ?


Also Read: RRR Craze: ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ నెంబర్ 1, రామ్ చరణ్ నెంబర్ 2.. ఇది కదా క్రేజ్ అంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook