Whatsapp Data Transfer: సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు అందిస్తుంటోంది. ఇప్పుడు డేటా బదిలీకు సంబంధించి మరో ఫీచర్ ప్రవేశపెట్టింది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెటా అనుబంధ సంస్థ వాట్సప్..ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్‌కు చాట్ హిస్టరీ బదిలీ చేయాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఈ సౌకర్యం కోసం చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నారు. అలా నిరీక్షించేవారికి గుడ్‌న్యూస్. ఇప్పుడు వాట్సప్‌లో ఆ ఫీచర్ కూడా వచ్చేసింది. మొన్నటివరకూ ఈ సౌకర్యం కేవలం బీటా యూజర్లకుండేది. ఇప్పుడు అందరికీ అందుబాటులో వచ్చింది. మీ ఎక్కౌంట్ ఇన్‌ఫో, ప్రొఫైల్ ఫోటో, గ్రూప్ చాట్, చాట్ హిస్టరీ, మీడియా సెట్టింగ్స్ అన్నీ బదిలీ అయిపోతాయి. మీ డేటా పూర్తిగా ఏదీ మిస్సవకుండా బదిలీ అవుతుంది. 


iPhone నుంచి  Androidకు డేటా బదిలీ ఎలా


మెటాకు చెందిన వాట్సప్ అందించిన వివరాల ప్రకారం ఐవోఎస్ 15.5 లేదా తరువాతి వెర్షన్‌పై నడిచే ఐఫోన్, ఆండ్రాయిడ్ 5 ఫోన్ ఉండాలి. ఇది కాకుండా మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో వాట్సప్ వెర్షన్ 2.22.7.74  ఉండాలి. ఐవోఎస్ డివైస్‌లో అయితే వాట్సప్ వెర్షన్ 2.22.10.70 అవసరమౌతుంది. అటు ఐఫోన్ కూడా కొత్తది లేదా ఫ్యాక్టరీ రీసెటా్ అయుండాలి. అటు ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఐవోఎస్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుండాలి. మీ కొత్త ఐవోఎస్ డివైస్‌లో ఒకటే ఫోన్ నెంబర్ యూజ్ చేసుండాలి. రెండు ఫోన్లు ఒకే వైఫై నెట్‌వర్క్‌తో కనెక్ట్ అవాలి. 


FAQ పేజిలో ఇంకా ఇతర స్టెప్స్‌ను చూడవచ్చు. అందులో ఇచ్చిన స్టెప్స్ ప్రకారం ఫాలో అయితే మీ డేటా బదిలీ అవుతుంది. బదిలీ అయ్యే మీ డేటా రహస్యంగా ఉంటుంది. డేటా బదిలీ తరువాత పాత ఫోన్ నుంచి డేటా డిలీట్ చేయవచ్చు. కాల్ హిస్టరీ, కాంటాక్ట్ నేమ్స్ మాత్రం బదిలీ కావు. 


Also read: Reliance Jio Laptop: రిలయన్స్ నుంచి మరో సంచలనం, అత్యంత చౌక ధరకే ల్యాప్‌టాప్, నవంబర్‌లో లాంచ్



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook