Reliance Jio Laptop: రిలయన్స్ నుంచి మరో సంచలనం, అత్యంత చౌక ధరకే ల్యాప్‌టాప్, నవంబర్‌లో లాంచ్

Reliance Jio Laptop: రిలయన్స్ జియో మరో సంచలనానికి తెర తీయనుంది. కేవలం 15 వేలకే జియో ల్యాప్‌టాప్ ప్రవేశపెట్టనుంది. నవంబర్‌లో లాంచ్ కానున్న ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 3, 2022, 10:07 PM IST
Reliance Jio Laptop: రిలయన్స్ నుంచి మరో సంచలనం, అత్యంత చౌక ధరకే ల్యాప్‌టాప్, నవంబర్‌లో లాంచ్

Reliance Jio Laptop: రిలయన్స్ జియో మరో సంచలనానికి తెర తీయనుంది. కేవలం 15 వేలకే జియో ల్యాప్‌టాప్ ప్రవేశపెట్టనుంది. నవంబర్‌లో లాంచ్ కానున్న ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

టెలీకం దిగ్గజ కంపెనీగా ఎదిగిన రిలయన్స్..బ్రాడ్‌బాండ్ మార్కెట్‌ను దాదాపుగా ఆక్రమిస్తోంది. ఇప్పుడు ల్యాప్‌టాప్ మార్కెట్‌పై కన్నేసింది. మరో సంచలనానికి తెర తీయనుంది. అత్యంత తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో చౌకధరకే ల్యాప్‌టాప్ లాంచ్ చేయనున్నట్టు సమాచారం. 

4జి టెక్నాలజీతో టెలీకం రంగంలో విప్లవం రేపిన రిలయన్స్ జియో నుంచి ఇప్పుడు మరో గుడ్‌న్యూస్ అందుతోంది. అతి తక్కువ ధరకు 4జి ఫోన్లలానే..4జి ల్యాప్‌టాప్స్ తీసుకొస్తోంది. అతి తక్కువ ధరకు అంటే కేవలం 15 వేల రూపాయలకే ల్యాప్‌టాప్ అందించనుంది రిలయన్స్ జియో. 

ఇప్పటికే క్వాల్‌కామ్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. జియో బుక్ కోసం ఈ డీల్ కుదిరింది. క్వాల్‌కామ్ సంస్థ కంప్యూటింగ్ చిప్ అందించనుండగా ఏఆర్ఎం లిమిటెడ్ టెక్నాలజీతో రూపుదిద్దుకోనుంది. విండోస్ ఓఎస్ యాప్స్ సపోర్ట్ చేసేలా మార్పులు చేర్పులు ఉంటాయి. ఇప్పటికే 42 కోట్లమంది యూజర్లతో రిలయన్స్ జియో అతిపెద్ద టెలీకం కంపెనీగా ఉంది. జియో ఫోన్‌లో 5జి వెర్షన్ అందుబాటులోకి తీసుకురానుంది. 

త్వరలో లాంచ్ చేయనున్న జియో ల్యాప్‌టాప్‌ను ముందుగా ప్రభుత్వ స్కూల్స్, కళాశాలలకు అందించనుందని సమాచారం. అయితే జియో నుంచి మాత్రం ల్యాప్‌టాప్‌ల విషయంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. జియో బుక్ అనేది దేశీయంగా తయారు కానుంది. జియో సొంత ఓఎస్‌పై పని చేయనుంది. వ్యక్తిగత కంప్యూటర్ విభాగంగా దూసుకుపోతున్న హెచ్‌పి, డెల్, లెనోవా మార్కెట్‌ను క్యాప్చర్ చేసేందుకు రిలయన్స్ జియో సంసిద్ధమౌతోంది. 

Also read : SIP Benefits: ఎస్ఐపీ ఎలా ప్రారంభించాలి, అధిక లాభాలు రావాలంటే ఏం చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News