Whatsapp: ఈ సులభమైన చిట్కాతో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవచ్చు
Whatsapp: చాలామంది అవతలి వ్యక్తికి తెలియకుండానే వాట్సప్ నెంబర్ బ్లాక్ చేస్తుంటారు. కానీ ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకుంటే..ఆ వ్యక్తి గురించి మీరు అర్ధం చేసుకునేందుకు వీలవుతుంది. వాట్సప్‌లో ఎవరు మిమ్మల్ని బ్లాక్ చేశారో ఎలా తెలుసుకోవచ్చు మరి..
ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ వాడనివారుండరంటే అతిశయోక్తి లేదు. నచ్చని వ్యక్తిని బ్లాక్ చేసే సౌకర్యం కూడా వాట్సప్‌లో ఉంది. అదే సమయంలో ఎవరు ఎవర్ని బ్లాక్ చేశారనేది ఎలా తెలుసుకోవచ్చనేది పరిశీలిద్దాం..
రోజూ వాట్సప్ వాడుతుంటారు కానీ చాలామందికి అందులో ఉండే వివిధ ఫీచర్ల గురించి అవగాహన ఉండదు. వాట్సప్‌లో మనకే తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఎన్నో ఫీచర్లున్నాయి. కొందరు కావాలని..కొందరు తెలియక మీ వాట్సప్ నెంబర్ బ్లాక్ చేస్తుంటారు. అది ఎవరు బ్లాక్ చేశారనేది తెలుసుకోవడం సాధ్యం కాదు. కానీ దీనికి కూడా ఓ సులభమైన పద్ధతి ఉంది. ఆ చిట్కా ఏంటనేది తెలుసుకుందాం..
మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకునేందుకు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు కాంటాక్ట్ డీపీ కన్పించలేదంటే..మిమ్మల్ని ఎవరో బ్లాక్ చేసినట్టు అర్ధం. అయితే కొంతమంది కాంటాక్ట్ డీపీ రిమూవ్ చేస్తుంటారు. అటువంటి సందర్భాల్లో బ్లాక్ చేశారా లేదా అనేది నిర్ధారించలేం. కానీ బ్లాక్ అయితే మాత్రం కాంటాక్ట్ స్టేటస్ కూడా కన్పించదు. ఈ రెండూ కన్పించకపోతే మాత్రం మిమ్మల్ని అవతలి వ్యక్తి బ్లాక్ చేసినట్టే.
మిమ్మల్ని బ్లాక్ చేశారా లేదా అనేది తెలుసుకునేందుకు సంబంధిత యూజర్‌కు మెస్సేజ్ పంపించి కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు పంపించిన మెస్సేజ్ డెలివరీ అవుతుంటే..ఎవరూ మిమ్మల్ని బ్లాక్ చేయలేదని అర్ధం. కానీ డెలివరీ కాకపోతే బ్లాక్ చేసినట్టే. నిజంగా ఎవరైనా బ్లాక్ చేస్తే..ఎట్టి పరిస్థితుల్లోనూ మెస్సేజ్ డెలివరీ కాదు.
అన్‌బ్లాక్ చేయడం ఎలా
ఒకవేళ మీరు ఎవరినైనా అన్‌బ్లాక్ చేయాలనుకుంటే.కొంత ప్రోసెస్ ఉంటుంది. మరొకరి కాంటాక్ట్‌లో వెళ్లి మిమ్మల్ని మీరు అన్‌బ్లాక్ చేసుకోలేరు. దీనికోసం అవతలి యూజర్‌కు విజ్ఞప్తి పంపించాల్సి ఉంటుంది. మిమ్మల్ని బ్లాక్ చేసిన యూజర్ కోరుకుంటేనే మీరు తిరిగి అన్‌బ్లాక్ అవుతారు. మరో మార్గం లేదు కూడా.
Also read: Airtel 199 Plan: ఎయిర్‌టెల్ గుడ్‌న్యూస్, 199 రూపాయలకే అన్‌లిమిటెడ్ కాల్స్‌తో ప్రీపెయిడ్ ప్లాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook