Acemagic Laptop: ప్రపంచంలో మొట్టమొదటి డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్, ఫీచర్లు చూస్తే అద్దిరిపోవల్సిందే
Acemagic Laptop: మార్కెట్లో చాలా రకాల ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ల్యాప్‌టాప్ ఒక్కో రకంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ తరహా ల్యాప్‌టాప్ ఇప్పటి వరకూ ఇదే. మరెక్కడా లేదు. ప్రపంచంలోనే మొట్టమొదటి ల్యాప్‌టాప్ ఇది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Acemagic Laptop: మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏ ల్యాప్‌టాప్ తీసుకున్నా మోడల్ దాదాపు ఒకటే ఉంటుంది. సైజ్ కొద్దిగా తేడా ఉండవచ్చు. ఫీచర్లు ఒక్కటే మారుతుంటాయి. స్థూలంగా చెప్పాలంటే కాన్ఫిగరేషన్ మారుతుంటుంది. కానీ ఈ ల్యాప్‌టాప్ మోడలే వేరుగా ఉంటుంది. ఇదొక యూనిక్ మోడల్ ల్యాప్‌టాప్. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్ ఇది.
Acemagic సంస్థ Computex 2024లో Acemagic X1 ప్రదర్శించి అందర్నీ ఆకర్షించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్. అంటే రెండు వైపులా స్క్రీన్ చూడవచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీ ఎదురుగా కూర్చున్న వ్యక్తి కూడా స్క్రీన్ చూడవచ్చు. ఈ స్క్రీన్ మరో ప్రత్యేకత ఏంటంటే 360 డిగ్రీలు పోల్డ్ చేసుకోవచ్చు. అంటే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫోల్డబుల్ మొబైల్ ఫోన్లలా పనిచేస్తాయి. ఫ్లిప్ స్క్రీన్ అని చెప్పవచ్చు. ఎదురుగా ఉన్న వ్యక్తికి స్క్రీన్ చూపించేందుకు వీలుగా ఇందులో బ్యాక్ టు బ్యాక్ మోడ్ ఫీచర్ ఉది. లేదా సైడ్ వ్యూ కింద కూడా మార్చుకోవచ్చు. ఆన్ స్క్రీన్ గేమింగ్, విజ్యువలైజేషన్, మూవీ వాచింగ్ చాలా ఎంజాయ్ చేయవచ్చు.
ఈ ల్యాప్‌టాప్ 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i7-1255U ప్రోసెసర్ కలిగి ఉంటుంది. Acemagic X1 అనేది 14 అంగుళాల ఫుల్ హెచ్ డి స్క్రీన్ తో వస్తోంది. ఇందులో 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ వెర్షన్ ఉంటుంది. ఇక కనెక్టివిటీ అయితే లేటెస్ట్ ఫీచర్లు అన్నీ ఉన్నాయి. వైఫై 6, బ్లూటూత్ 5.2 సపోర్ట్ చేస్తుంది. యూఎస్ బి టైప్ సి పోర్ట్ ఉంటుంది. ఇందులో పక్క పక్కన రెండు స్క్రీన్స్ ఓపెన్ చేసుకోవచ్చు. Acemagic X1 మార్కెట్ లో ఎప్పుడు ప్రవేశిస్తుంది, ధర ఎంత ఉంటుందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook