Upcoming IPO: షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్, ఈ నెలలో లాభాలు కురిపించేందుకు వస్తున్న రెండు ఐపీవోలు

Upcoming IPO: షేర్ మార్కెట్ లో డబ్బులు ఆర్జించే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. త్వరలో రెండు కొత్త ఐపీవోలు మార్కెట్ లో రానున్నాయి. రెండు పెద్ద కంపెనీలు పబ్లిక్ ఇష్యూ తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించాయి. మీకూ ఆసక్తి ఉంటే ఇప్పట్నించే సిద్ధం కండి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 18, 2024, 11:51 AM IST
Upcoming IPO: షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్, ఈ నెలలో లాభాలు కురిపించేందుకు వస్తున్న రెండు ఐపీవోలు

Upcoming IPO: షేర్ మార్కెట్ లో అటు బీఎస్ఈ కానీ ఇటు ఎన్ఎస్ఈ లో కానీ ప్రతి వారం చాలా ఐపీవోలు ఎంట్రీ ఇస్తుంటాయి. కొన్ని కంపెనీల ఐపీవోలు ఊహించని రీతిలో ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలు ఆర్జించి పెడుతుంటాయి. మరి కొన్ని విఫలమౌతుంటాయి. అందుకే షేర్ మార్కెట్ లో పెట్టుబడికి ఎప్పుడూ నిశిత పరిశీలన అవసరమంటారు మార్కెట్ నిపుణులు. అయితే ఇప్పుడు షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లకు త్వరలో మంచి లాభాలు ఆర్జించే షేర్లు అందుబాటులో రానున్నాయి. 

షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆలోచిస్తుంటే కాస్త నిరీక్షించండి. త్వరలో రెండు ప్రముఖ కంపెనీలు ఐపీవో తీసుకొస్తున్నాయి. ఒకటి ప్రముఖ టూ వీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ అయితే రెండవది ఫార్మా కంపెనీ ఎంక్యూర్. ఇప్పటికే సెబీ నుంచి ఐపీవోకు ఆనుమతి లభించింది.ఈ రెండు కంపెనీల ఐపీవో డ్రాఫ్ట్ లు జూన్ 10వ తేదీన ఆమోదం పొందాయి. అంటే ఇక ఓలా ఎలక్ట్రిక్, ఎంక్యూర్ ఫార్మా కంపెనీలు ఐపీవో తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. ఓలా ఎలక్ట్రిక్ ప్రతిపాదిత ఐపీవోలో 5500 కోట్ల రూపాయల కొత్త షేర్లు జారీ చేయడంతో పాటు ప్రొమోటర్లకు 9.52 కోట్ల ఈక్విటీ షేర్లు ఇచ్చే ఆలోచన ఉంది. బెంగళూరు ఆధారిత ఓలా ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ మొదటి మెడల్ 2021 ఆగస్టు నెలలో మార్కెట్ లో వచ్చింది. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలతో పాటు బ్యాటరీ, మోటార్లు కూడా తయారు చేస్తోంది. 

ఇక ఫార్మా రంగంలో చాలాకాలంగా ఉన్న ఎంక్యూర్ పార్మాస్యూటికల్ కంపెనీ ఐపీవోలో 800 కోట్ల కొత్త షేర్లు జారీ చేయనుంది. ఇక ప్రొమోటర్లకు 1.36 కోట్ల ఈక్విటీ షేర్లు కేటాయించనుంది. ఐపీవో ద్వారా సేకరించే నిధుల్ని రుణాల చెల్లింపు, కంపెనీ నిర్వహణకు ఉపయోగించనుంది. రెండు కంపెనీలు మార్కెట్ విలువ కలిగి ఉన్నవే కావడంతో కచ్చితంగా ఐపీవోకు క్రేజ్ ఉండవచ్చని అంచనా.

Also: BMW CE 04 EV Scooter: బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News