COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Xiaomi 14 Series Release Date-Price In India: ప్రముఖ టెక్‌ కంపెనీ షావోమీ(Xiaomi) త్వరలోనే మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. కంపెనీ షావోమీ 14 సిరీస్‌తో మార్కెట్‌లోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. ఈ సిరీస్‌లలో మొత్తం కంపెనీ మూడు మొబైల్స్‌ను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే వాటికి సంబంధించింది మోడల్స్‌ను కూడా ప్రకటించింది. కంపెనీ Xiaomi 14, Xiaomi 14 Pro, Xiaomi 14 Ultra మోడల్స్‌లో తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా విడుదలకు ముందు ఈ సిరీస్‌లకు సంబంధించిన మొబైల్స్‌ ఫీచర్స్‌ లీక్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


షావోమీ(Xiaomi) కంపెనీ ఈ మూడు మొబైల్స్‌ను ఫిబ్రవరి 25న ప్రపంచ మార్కెట్‌లో లాంచ్‌ చేయబోతున్నట్లు వెల్లడించింది. అయితే ఈ సమాచారాన్ని ప్రముఖ టిప్‌స్టర్‌ అభిషేక్ యాదవ్ X ఖాతలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..షావోమీ 14, Xiaomi 14 అల్ట్రా అతి త్వరలోనే మార్కెట్‌లోకి కంపెనీ విడుదల చేయబోతుందని పేర్కొన్నారు. దీంతో పాటు ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా ఒక లక్షకుపై అల్ట్రా మోడల్‌ విక్రయాలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ మొబైల్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌ను కూడా టిప్‌స్టర్‌ లీక్‌ చేశాడు. అయితే ఇప్పటికే ఈ రెండు వేరియంట్స్‌ చైనాలో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. వీటిని ఆధారంగా చేసుకునే ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వెల్లడించిన్నట్లు తెలిపారు. 


Xiaomi 14 సిరీస్ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
షావోమీ(Xiaomi) 14 సిరీస్ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ విషయానికొస్తే..ఇంతక ముందు చైనా లాంచ్‌ చేసిన మోడల్స్‌ డిజైన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇవి ఎంతో శక్తివంతమైన Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌లను కలిగి ఉంటాయి. అలాగే UFS 4.0 స్టోరేజ్‌తో పాటు 16GB ర్యామ్‌ను కలిగి ఉంటాయి. ఇది  ఆండ్రాయిడ్ 14 OSపై పని చేస్తుంది. దీంతో పాటు 6.36 అంగుళాల డిస్ల్పేతో రాబోతోంది. ఇక Xiaomi 14 ప్రో విషయానికొస్తే ఇది 6.73 అంగుళాల డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ మొబైల్స్‌ 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటాయి. దీంతో పాటు 32 మెగాపిక్సెల్ ఫ్రాంట్‌ కెమెరాతో అందుబాటులోకి వస్తోంది. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఈ స్మార్ట్‌ఫోన్స్‌ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4610mAh బ్యాటరీని ప్యాక్‌ను కలిగి ఉంటాయి. ఇక ప్రో వేరియంట్‌లో మాత్రం 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉండబోతున్నట్లు టిప్‌స్టర్‌ తెలిపారు. అలాగే మరో రెండు మొబైల్స్‌ 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఫీచర్స్‌ కలిగి ఉంటాయి. దీంతో పాటు ఇవి 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను ఇస్తాయి. ఇక వీటి ధర విషయానికొస్తే..Xiaomi 14 వేరియంట్‌ ధర MRP రూ.50,000కు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రో వేరియంట్‌ ధర రూ. 80,000 ఉండే ఛాన్స్‌ ఉందని టిప్‌స్టర్‌ తెలిపారు.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter