Zoom App: వీడియో కాలింగ్, మీటింగ్స్, ఆన్‌లైన్ క్లాసెస్ కోసం జూమ్ యాప్ ఉపయోగం విస్తృతమైపోయింది. మీరు కూడా జూమ్ యాప్ వాడుతుంటే తస్మాత్ జాగ్రత్త. హ్యాకర్ల ప్రమాదం పొంచి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అతిపెద్ద సమస్య హ్యాకింగ్. హ్యాకింగ్ చేసేందుకు కొత్త కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ యాప్స్ సెక్యూరిటీని బ్రీచ్ చేయడం ద్వారా హ్యాకర్లు సులభంగా..యూజర్ల వ్యక్తిగత డేటా దొంగిలిస్తున్నారు. చివరికి బ్యాంకు ఎక్కౌంట్ల నుంచి డబ్బులు కూడా తస్కరించేస్తున్నారు. ఇప్పుడు జూమ్ యాప్ హ్యాకర్లకు కొత్త ఆయుధంగా మారింది. జూమ్ యాప్ ద్వారా హ్యాకర్లు యూజర్లను టార్గెట్ చేస్తున్నారు.ఈ విషయంపై స్వయంగా కేంద్ర ప్రభుత్వమే హెచ్చరిక జారీ చేసింది. జూమ్ యాప్ ద్వారా హ్యాకర్ల నుంచి ఏం ముప్పు ఉంది. ప్రభుత్వం ఏం చెబుతోంది, ఎలా రక్షించుకోవాలనేది తెలుసుకుందాం..


జూమ్ యాప్ వినియోగంలో అప్రమత్తత


జూమ్ యాప్ వినియోగిస్తుంటే మీకు హ్యాకర్ల నుంచి ముప్పు ఉన్నట్టే. ఎందుకంటే ఈ యాప్‌లో సెక్యూరిటీ ఫ్లాస్ చాలా కన్పిస్తాయి. ఇందులో ముఖ్యమైంది జూమ్ యాప్ స్వయంగా హ్యాకర్లకు మీటింగుల్లో చేరవచ్చని అనుమతి ఇచ్చేస్తుంటుంది. ఈ విషయం మీటింగ్‌లో ఉన్న మిగిలిన సభ్యులకు తెలియదు. ఈ సమాచారం ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అంటే సెర్ట్ ఇన్ నుంచి లభించింది. 


యాప్ సెక్యురిటీ బ్రీచ్ సక్సెస్ అయితే..హ్యాకర్లు మీటింగులకు సంబంధించిన ఆడియో, వీడియో ఫీడ్స్ తీసుకోగలరు. కాల్స్ సందర్భంగా షేర్ చేసే సున్నితమైన సమాచారాన్ని కూడా తస్కరించేస్తారు. కేంద్ర ఐటీ, ఇన్‌ఫర్మేషన్ శాఖ..హ్యాకర్లు ఈ మప్పుును మీడియం కేటగరీగా పరిగణించింది. 


మొత్తం మూడు వల్నరబిలిటీస్ లబించాయని కేంద్రం, జూమ్ యాప్ స్పష్టం చేశాయి. CVE-2022-28758, CVE-2022-28759, CVE-2022-28760లుగా తేల్చాయి.  హ్యాకర్ల నుంచి సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలో కూడా కేంద్రం సూచించింది. యూజర్లు డెస్క్‌టాప్‌పై ఉన్న జూమ్ యాప్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. మొబైల్‌లో వినియోగిస్తుంటే..అందులో కూడా అప్‌డేట్ చేయాలి. జూమ్ యాప్‌తో పాటు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కూడా అప్‌డేట్ చేసుకోవాలి.


Also read: Money Making Tips: ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో డబ్బులు ఎలా సంపాదించడం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook