TSRTC Bus: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి నో టెన్షన్
TSRTC Special Buses: హైదరాబాద్ విద్యార్థులకు ఇక నుంచి ఫుట్‌బోర్డు ప్రయాణానికి చెక్ పడనుంది. బస్సులను అదనపు ట్రిప్పులు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయనున్నారు.
TSRTC Special Buses: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు వెళ్లి వస్తున్న విద్యార్థులకు టీఆర్ఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. సూడెంట్స్ కోస అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. విద్యార్థులను క్షేమంగా విద్యాసంస్థలకు చేర్చేందుకు 100 అదనపు ట్రిప్పులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బస్సుల ఏర్పాటుపై గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులతో హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు. శివారు ప్రాంతాల్లో విద్యార్థుల రద్దీ, ప్రస్తుతం ఉన్న బస్సుల వివరాలను అధికారులను సజ్జనార్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. సామాజిక బాధ్యతగా విద్యార్థులను క్షేమంగా విద్యా సంస్థలకు చేర్చేందుకు టీఎస్‌ఆర్టీసీ కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. శివారు ప్రాంతాలను 12 కారిడార్‌లుగా విభజించి.. 350 వరకు బస్సులను నడుపుతున్నాన్నారు. ఇబ్రహీంపట్నం క్లస్టర్‌లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉందనే విషయం సంస్థ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆ కారిడార్‌లోని కాలేజీలకు దాదాపు 44 వేల మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారని.. వారిలో 3వ వంతు బస్‌పాస్‌లు తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు.
అందుకు అనుగుణంగా గత వారం రోజులుగా 8 ట్రిప్పులను అదనంగా నడుపుతున్నామని.. రద్దీ ఎక్కువగా ఉంటే మరిన్నీ బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు సజ్జనార్. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఇబ్రహీంపట్నం కారిడార్‌లో 30 అదనపు ట్రిప్పులను నడపాలని చెప్పారు. హైదరాబాద్‌లో ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయని వెల్లడించారు. విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులను హైదరాబాద్ శివారు విద్యాసంస్థల వరకు ఏర్పాటు చేయాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నామన్నారు. త్వరలోనే విద్యార్థినుల ప్రత్యేక బస్సులు అందుబాటులోకి వస్తాయ్నారు.
'విద్యార్థులు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు. ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలి. కొందరు విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా ఫుట్‌బోర్డులో ప్రయాణిస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. వారు బస్సులోపలికి ఎక్కి సిబ్బందికి సహకరించాలి..' అని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
Also Read: CM Jagan Mohan Reddy: వ్యవసాయ కనెక్షన్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి మరింత వేగం
Also Read: PM Kisan Yojana 2023: పీఎం కిసాన్ స్కీమ్ అప్‌డేట్.. అకౌంట్‌లోకి డబ్బులు ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి