హైదరాబాద్: తెలంగాణలోని మెడికల్ గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వైద్యారోగ్య శాఖలో మరో 1050 పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖల ముఖ్యకార్యదర్శి శాంతికుమారి గురువారం (ఫిబ్రవరి 13న) ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)‌లో ప్రస్తుతం ఉన్న బస్తీ దవాఖానాల సంఖ్యను 118 నుంచి 350కి పెంచుతున్నారు. దీంతో కొత్త పోస్టులు ఏర్పడతాయి. ఆ మేరకు 1050 పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. మెడికల్ విద్యార్థులకు ఇది మంచి అవకాశం.


152 మెడికల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. దరఖాస్తు పూర్తి వివరాలు మీకోసం


మరిన్ని ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి


అర్హ‌త‌: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్‌ చదివి ఉండాలి. స్టాఫ్ నర్సు పోస్టులకు జీఎన్ఎం లేక బీఎస్సీ నర్సింగ్, ఒకవేళ రెండు క్వాలిఫికేషన్ ఉన్నవారికి అత్యధిక మార్కులను వెయిటేజీ తీసుకుంటారు. కౌన్సిల్ రిజిస్టేషన్ ఉండాలి. జాబ్ దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. 


జీతం: మెడికల్ ఆఫీసర్‌కు నెలకు రూ.42,000, స్టాఫ్ నర్సులకు రూ.21000 చొప్పున, సహాయక సిబ్బందికి రూ.10,000 చొప్పున చెల్లిస్తారు.


ట్రాన్స్‌కోలో చార్టెడ్ అకౌంటెంట్ పోస్టులు


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..