హైదరాబాద్: తెలంగాణలోని మెడికల్ గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వైద్య, ఆరోగ్య శాఖలోని పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖల ముఖ్యకార్యదర్శి శాంతికుమారి 152 పోస్టుల భర్తీకి గురువారం (ఫిబ్రవరి 13న) ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేపట్టారు. గడువు ముగిస్తే ఉద్యోగ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంది.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఉన్న బస్తీ దవాఖానాలను 118 నుంచి 350కి పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో మెడికల్ ఆఫీసర్ (డాక్టర్) 94 పోస్టులు, స్టాఫ్ నర్సు 58 పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
అర్హత: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్ డిగ్రీతో పాటు అనుభవం. స్టాఫ్ నర్సు పోస్టులకు జీఎన్ఎం లేక బీఎస్సీ నర్సింగ్ చదివి ఉండాలి. ఒకవేళ రెండు క్వాలిఫికేషన్ ఉంటే అత్యధిక మార్కులను వెయిటేజీగా పరిగణిస్తారు. కౌన్సిల్ రిజిస్టేషన్ ఉండటం ఉత్తమం.
వయసు: జులై 1, 2020 నాటికి పోస్టులను బట్టి 18 నుంచి 34 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులు.
జీతం: మెడికల్ ఆఫీసర్‌కు రూ.42,000, స్టాఫ్ నర్సులకు రూ.21000 చొప్పున నెలవారీ జీతం అందుకుంటారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
గడువు: 24-02-2020 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు
ఎంపిక విధానం: రాతపరీక్ష మార్కులు, వయసు, ఎడ్యూకేషన్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
ఈ పోస్టులకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని నింపాలి. అప్లికేషన్ ఫారంతో పాటు నోటిఫికేషన్లో పేర్కొన్న సర్టిఫికెట్లను ఈ కింది చిరునామాకు ఫిబ్రవరి 24 సాయంత్రం 5గంటల్లోగా అందేలా దరఖాస్తును పంపించాలి. నేరుగా వెళ్లి కూడా దరఖాస్తు అందజేయవచ్చు.
మరిన్ని ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి
ట్రాన్స్‌కోలో చార్టెడ్ అకౌంటెంట్ పోస్టులు
చిరునామా: జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి కార్యాలయం, నాలుగో అంతస్తు, ఎన్టీపీసీ బిల్డింగ్, ప్యాట్నీ, సికింద్రాబాద్, హైదరాబాద్ జిల్లా.
To Address:
District Medical & Health Officer, Hyderabad District, 4th floor, NTPC Building, Patny, Secunderabad.