Gang Rape Case Update: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈకేసులో ఏకైక మేజర్, ఏ1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సాదుద్దీన్ పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ బుధవారం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో చంచల్ గూడ జైలు నుంచి  సాదుద్దీన్ ను జూబ్లీహిల్స్ పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. గ్యాంగ్ రేపులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడిని ప్రశ్నించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిందితుడిని నాలుగు రోజుల రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా మొదటి రోజు నిందితుని ప్రొఫైల్, మైనర్స్ తో ఒకరికొకరు ఎలా పరిచయం అయ్యారన్న దానిపై ఆరా తీయనున్నారు పోలీసులు. మే28న అమ్నేషియా పబ్ లో ఏం జరిగింది.. మైనర్ బాలికను ఎలా ట్రాప్ చేశారు.. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఏడున్నర వరకు ఏం జరిగిందో తెలుసుకోనున్నారు పోలీసులు. నిందితులు పబ్ కు ఎందుకు వెళ్లారు.. బాలికను మొదటగా తీసుకెళ్లిన బెంజ్ కారు ఎవరిచ్చార అన్న వివరాలపై ప్రశ్నించనున్నారు. గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనాస్థలంలో సాదుద్దీన్ తో సీన్ రికన్‌స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. సాదుద్దీన్‌ విచారణలో కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోనికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.


మైనర్ బాలిక గ్యాంగ్ రేపు కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో సాదుద్దీన్ ఒక్కడే మేజర్. అతన్ని రిమాండ్ లో చంచల్ గూడ జైలుకు తరలించారు. మిగిలిన ఐదుగురు నిందితులు మైనర్లు కావడంతో జూవైనల్ హోంకు తరలించారు. ఈకేసులో ఐదుగురు నిందితులపై గ్యాంగ్ రేప్ 376డీతో పాటు పోక్స్ చట్టం, కిడ్నాప్, ఐటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆరవ నిందితుడిగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు కూడా మైనరే. అతనిపై పోక్సో, లైంగిక వేధింపుల చట్టం కింద కేసు నమోదైంది. జూవైనల్ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లను విచారించేందుకు జూవైనల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. అటు నిందితులు కూడా బెయిల్ పిటిషన్ వేశారు.


READ ALSO: Covid 19 Fourth wave: భారత్ లో కొవిడ్ ఫోర్త్ వేవ్ మొదలైందా? 7 వేలు దాటిన రోజువారీ కేసులు కేసులు..కేంద్ర సర్కార్ హై అలర్ట్  


READ ALSO: Viral News: రూ.50 వేలు ఇస్తేనే కొడుకు శవం.. లంచం డబ్బుల కోసం వీధుల్లో ఆ పేద తల్లిదండ్రుల భిక్షాటన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook