Telangana: పెళ్లింట విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మృతి
తెలంగాణ ( Telangana ) లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది.
Telangana Road Accident - 3 persons killed: హైదరాబాద్: తెలంగాణ ( Telangana ) లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. మరికాసేపట్లో శుభకార్యం జరుగుతుందనగా.. ఈ ప్రమాదం జరగడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటన ( Road Accident ) జిల్లాలోని బిచ్కుంద మండలం (Bichkunda) చిన్నదేవడాలో చోటుచేసుకుంది.
ఈ రోజు పెళ్లి ఉండటంతో శుభకార్యం నిమిత్తం గురువారం ఉదయం ట్రాక్టర్ ద్వారా ట్యాంకర్‌లో నీరు తెస్తుండగా.. బోల్తాపడింది. దీంతో దానిలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. Also read: Farmer protests: సిక్కు మతగురువు ఆత్మహత్య
సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు చిన్నదేవడా గ్రామానికి చెందిన తుకారం, బిచ్కుంద వాసి సాయిలు, మద్నూర్‌కు చెందిన శంకర్‌గా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also read: Parliament: శీతాకాల సమావేశాలు రద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook